News May 15, 2024
1998లో మిస్సయ్యాడు.. పక్కింట్లోనే దొరికాడు

అల్జీరియాలో ఓమర్ బి(45) అనే వ్యక్తి 1998లో తప్పిపోయి.. 26ఏళ్ల తర్వాత పక్కింట్లో ప్రత్యక్షమయ్యారు. 1998 అల్జీరియన్ అంతర్యుద్ధంలో ఒమర్‌ని ఎవరో కిడ్నాప్/హతమార్చారని కుటుంబం భావించింది. అయితే అతడిని ఇన్నాళ్లు పక్కింటి వ్యక్తే(61) బంధించినట్లు తేలింది. విదేశాలకు పారిపోవాలని చూసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బందీగా ఉండటంతో సహాయం పొందలేకపోయానని ఓమర్ చెప్పారు. బంధించడానికి కారణాలు చెప్పలేదు.
Similar News
News December 17, 2025
MLAలకు స్పీకర్ క్లీన్‌చిట్.. నెక్స్ట్ ఏంటి?

TG: పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ ప్రసాద్ ఐదుగురు <<18592868>>MLA<<>>ల వాదనలతో ఏకీభవించారు. తాము ముఖ్యమంత్రిని కలిసిన మాట నిజమేనని కానీ పార్టీ మారలేదని, కండువా కప్పుకోలేదని వారు స్పష్టం చేశారు. నిధుల కోసం CMను కలవడంలో తప్పు లేదని వాదించారు. దీంతో వారు పార్టీ మారినట్లు BRS చేసిన ఆరోపణలను స్పీకర్ కొట్టేశారు. ఫలితంగా వారు MLAలుగా కొనసాగనున్నారు. ఇదే విషయాన్ని రేపు అసెంబ్లీ కార్యదర్శి సుప్రీంకోర్టుకు తెలపనున్నారు.
News December 17, 2025
రూపాయి పతనమైతే సామాన్యుడికి ఏంటి సమస్య?

రూపాయి విలువ పడిపోతే తమపై ఏ ప్రభావం ఉండదని సామాన్యులు అనుకుంటారు. ప్రత్యక్షంగా లేకున్నా ఎగుమతి, దిగుమతుల ఖర్చులు పెరగడంతో మందులు, ఎలక్ట్రానిక్స్, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయడానికి RBI వడ్డీ రేట్లు పెంచితే లోన్ల EMIలు పెరుగుతాయి. కంపెనీల ఖర్చులు పెరగడంతో ఇంక్రిమెంట్లపై ప్రభావం పడుతుంది. రిక్రూట్‌మెంట్లు తగ్గుతాయి. బోనస్, వేరియబుల్ పే తగ్గే ఛాన్స్ ఉంది.
News December 17, 2025
పూజలతో బ్రహ్మ రాసిన రాతను మార్చొచ్చా?

‘అంతా తలరాత ప్రకారమే జరుగుతుంది అన్నప్పుడు పూజలు ఎందుకు చేయాలి?’ అనే సందేహం కొందరిలో ఉంటుంది. అయితే బ్రహ్మదేవుడు నుదుటిపై రాత రాసేటప్పుడు ‘నేను రాసిన రాతను నేను కూడా తప్పించలేను. కానీ ఉపాసన, ఆరాధన, అర్చనల ద్వారా ఆ విధిని మార్చుకునే శక్తి మీ చేతుల్లోనే పెడుతున్నాను’ అని కూడా రాశాడట. కాబట్టి, మన అర్చనలు, ఉపాసనలు, కర్మల ద్వారా మన విధిని మనం సవరించుకునే అవకాశం ఉంటుంది.


