News March 31, 2024

జస్ట్ 1.8 శాతం ఓట్ల తేడాతో గట్టెక్కారు: కేసీఆర్

image

TG: అధికారంలోకి వచ్చి నాలుగో నెల గడుస్తున్నా రుణ మాఫీపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేసీఆర్ ధ్వజమెత్తారు. ‘డిసెంబర్ 9 ఎప్పుడు పోయింది. సీఎం రేవంత్ ఎక్కడ పడుకున్నారు. జనాలకు ఇష్టమొచ్చిన సొల్లు పురాణాలు చెప్పి జస్ట్ 1.8శాతం ఓట్ల తేడాతో గట్టెక్కి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. మిమ్మల్ని నిద్రపోనివ్వం. తరిమి కొడతాం’ అని హెచ్చరించారు.

Similar News

News February 18, 2026

టెన్త్ అర్హతతో 28,636 ఉద్యోగాలు.. BIG UPDATE

image

ఇండియా పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో 28,636 GDS పోస్టులకు ఈ నెల 16 వరకు దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. వీటిలో TGలో 608, APలో 1060 ఖాళీలున్నాయి. తాజాగా అప్లికేషన్ల సవరణకు అవకాశం కల్పిస్తూ పోస్టల్ శాఖ కరెక్షన్ విండోను ఓపెన్ చేసింది. అభ్యర్థులు రేపు సా.5 గంటల వరకు దరఖాస్తులను <>https://www.indiapost.gov.in/<<>> సైట్‌లో ఎడిట్ చేసుకోవచ్చు.

News February 18, 2026

అంబటికి బెయిల్

image

AP: YCP నేత అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2023లో సంక్రాంతి సందర్భంగా లక్కీడ్రా పేరిట మోసం చేశారంటూ ఆయనపై సత్తెనపల్లి పీఎస్‌లో కేసు నమోదైైంది. అంబటిని కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. కాగా CBNను దూషించిన కేసు, పోలీసు విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఇప్పటికే ఆయనకు బెయిల్ లభించింది. అంబటి ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

News February 18, 2026

కూరగాయలు తాజాగా ఉండాలంటే?

image

కూరగాయలు తాజాగా ఉండటానికి జపనీయులు కాటన్, మస్లిన్ వస్త్రంలో చుట్టేస్తారు. ఆకుకూరలను కాస్త తడిపిన క్లాత్‌లో చుట్టి ఫ్రిడ్జ్‌లో ఉంచుతారు. అలాగే ఫ్రిడ్జ్‌లో కూరగాయలు పెట్టాలి అనుకున్నప్పుడు వాటిని శుభ్రంగా కడిగి, తుడిచి పొడిగా ఉన్నప్పుడే పెట్టాలి. పండిపోయినవి త్వరగా వాడేయాలి. లేదంటే వాటి ప్రభావం వేరే కూరగాయలపై పడుతుంది. అలాగే టైట్‌ కవర్‌లో కూరగాయలు పెట్టడం వల్ల తర్వరగా పాడైపోతాయి.