News April 22, 2024

కవిత బెయిల్ పిటిషన్ల‌పై నేడు విచారణ

image

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ల‌పై ఇవాళ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. లిక్కర్ స్కాం కేసులో ఈడీ, సీబీఐ కవితను అరెస్ట్ చేశాయి. దీంతో ఆమె 2 బెయిల్ పిటిషన్లు వేశారు. ఈనెల 16నే విచారణ జరగాల్సి ఉండగా జడ్జి సెలవులో ఉండటంతో నేటికి వాయిదా పడింది. మ.2 గం.కు వాదనలు ప్రారంభం కానున్నాయి. అటు కవిత ఈడీ, సీబీఐ జుడీషియల్ కస్టడీ రేపటితో ముగియనుంది. ఆమెను మంగళవారం కోర్టులో హాజరుపర్చనున్నారు.

Similar News

News December 8, 2025

నేషనల్ మెటలర్జికల్ లాబోరేటరీలో ఉద్యోగాలు

image

CSIR-నేషనల్ మెటలర్జికల్ లాబోరేటరీ(<>NML<<>>) 5జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు డిసెంబర్ 31 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 27ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్టెనోగ్రఫీ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.48వేల వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://nml.res.in/

News December 8, 2025

‘హమాస్’పై ఇండియాకు ఇజ్రాయెల్ కీలక విజ్ఞప్తి

image

‘హమాస్’ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలని భారత్‌ను ఇజ్రాయెల్ కోరింది. పాక్‌కు చెందిన లష్కరే తోయిబా, ఇరాన్ సంస్థలతో దీనికి సంబంధాలున్నాయని చెప్పింది. గాజాలో కార్యకలాపాల పునరుద్ధరణకు ప్రయత్నిస్తోందని, ప్రపంచవ్యాప్తంగా దాడులకు అంతర్జాతీయ సంస్థలను వాడుకుంటోందని తెలిపింది. హమాస్ వల్ల ఇండియా, ఇజ్రాయెల్‌కు ముప్పు అని పేర్కొంది. ఇప్పటికే US, బ్రిటన్, కెనడా తదితర దేశాలు హమాస్‌ను టెర్రర్ సంస్థగా ప్రకటించాయి.

News December 8, 2025

తెలంగాణ అప్డేట్స్

image

* ఈ నెల 17 నుంచి 22 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిది
* తొలిసారిగా SC గురుకులాల్లో మెకనైజ్డ్ సెంట్రల్ కిచెన్‌ను ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
* రాష్ట్రంలోని హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు, CHCల్లో మరో 79 డయాలసిస్ సెంటర్లు..
* టెన్త్ పరీక్షలకు విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్ ద్వారా మాత్రమే సేకరించాలని స్పష్టం చేసిన ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీహరి