News August 21, 2025

కేసీఆర్ పిటిషన్‌పై నేడు విచారణ

image

TG: ‘కాళేశ్వరం’ జస్టిస్ ఘోష్ <<17297853>>కమిషన్<<>> నివేదికను రద్దు చేయాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, జస్టిస్ ఘోష్ కమిషన్‌ను పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా BRS ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేసేలా నివేదిక ఉందని పిటిషన్‌లో వారు తెలిపారు.

Similar News

News January 16, 2026

పాపవినాశనం రోడ్డుపై భారీగా వాహనాలు

image

తిరుమలలో పార్వేట ఉత్సవం ఇవాళ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పాపవినాశనం తీర్థానికి వెళ్లేందుకు భక్తులను విజిలెన్స్ సిబ్బంది అనుమతించ లేదు. గోగర్భం సమీపంలోని గేటు వద్ద సిబ్బంది వాహనాలను అడ్డుకున్నారు. ఆక్టోపస్ భవనం వరకు వాహనాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఉత్సవాల కారణంగా వాహనాల అనుమతి కుదరదని విజిలెన్స్ అధికారులు భక్తులకు తెలియజేశారు. పాపనాశనం, ఆకాశంగంగకు అనుమతించాలని భక్తులు కోరుతున్నారు..

News January 16, 2026

OTTలో కొత్త సినిమాలు.. చూసేయండి!

image

సంక్రాంతి సందర్భంగా కొన్ని కొత్త సినిమాలు OTTలోకి వచ్చాయి. శివాజీ, నవదీప్ నటించిన ‘దండోరా’, ఫర్హాన్ అక్తర్, రాశీఖన్నా ‘120 బహదూర్’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో, జగపతిబాబు, సుహాసిని తదితరులు నటించిన ‘అనంత’ మూవీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటితో పాటు ZEE5లో గుర్రం పాపిరెడ్డి, సోనీలివ్‌లో మమ్ముట్టి ‘కలాంకావల్’ అందుబాటులో ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో వారం కిందట బాలయ్య ‘అఖండ-2’ విడుదలైంది.

News January 16, 2026

ప్రారంభమైన ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో BJP కూటమి

image

మహారాష్ట్రలో ముంబై, పుణే సహా 29 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. BMCలో ఎర్లీ ట్రెండ్స్‌ ప్రకారం BJP నేతృత్వంలోని మహాయుతి కూటమి అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు ఠాక్రే సోదరుల కూటమి మాత్రం వెనుకంజలో ఉంది. దాదాపు 50% పోలింగ్ నమోదైన ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకం కానున్నాయి.