News March 26, 2024
కేజ్రీవాల్ పిటిషన్‌పై రేపు విచారణ

లిక్కర్ స్కామ్ కేసులో తన రిమాండును సవాల్ చేస్తూ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ రేపు ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానుంది. జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఉదయం 10.30 గంటలకు ఈ పిటిషన్‌పై విచారణ జరపనున్నారు. ఈ కేసులో ఈ నెల 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం ఏడు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది.
Similar News
News February 12, 2026
శివ నామాలు అర్థాలు ‘‘త్రినేత్ర’’

శివుడి కుడి కన్ను సూర్యుడిని, ఎడమ కన్ను చంద్రుడిని సూచిస్తుంది. ‘జ్ఞాన నేత్రం’ అని పిలిచే మూడో కన్ను అగ్నిని సూచిస్తుంది. సాధారణ కళ్లు భౌతిక ప్రపంచాన్ని మాత్రమే చూస్తాయి. కానీ, మూడో కన్ను అంతరాత్మను, సత్యాన్ని దర్శిస్తుంది. అజ్ఞానాన్ని దహించివేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అంతటి శక్తి ఆ నేత్రమయం. అందుకే ఆయనను ముక్కంటి/త్రినేత్రుడు అంటారు. కామదహనంలో ఆయన తన మూడో కంటితోనే మన్మథుడిని భస్మం చేశాడు.
News February 12, 2026
శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

<
News February 12, 2026
T20 WC: నేటి మ్యాచులు

టీ20 వరల్డ్ కప్‌లో ఇవాళ 3 మ్యాచులు జరగనున్నాయి.
✮ ఫస్ట్ మ్యాచ్: శ్రీలంకvsఒమన్(11am)
✮ సెకండ్ మ్యాచ్: నేపాల్vsఇటలీ(3pm)
✮ మూడో మ్యాచ్: ఇండియాvsనమీబియా(7pm)
✮ ఈ మ్యాచులన్నీ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో పాటు జియో హాట్‌స్టార్‌లో Live చూడవచ్చు.


