News April 21, 2024
భారీ వరదలు.. అప్రమత్తంగా ఉండండి: చైనా

వందేళ్లలో ఒకసారి వచ్చే స్థాయి వరదలు రానున్నాయని, అప్రమత్తంగా ఉండాలని చైనా తమ ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. దక్షిణ చైనాలోని పలు ప్రాంతాల్లో తీవ్రస్థాయి వర్షాలు కురుస్తున్నాయి. మున్ముందు అవి తీవ్ర స్థాయికి చేరతాయని చైనా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో అత్యవసరంగా ముందస్తు జాగ్రత్తలు చేపడుతోంది. పెరల్ నది డెల్టా ప్రాంతంలో 19 అడుగుల ఎత్తు వరకు వరద ప్రవాహం రావొచ్చని సర్కారు హెచ్చరించడం గమనార్హం.
Similar News
News December 12, 2025
నేను, గిల్ అలా చేసి ఉండాల్సింది: సూర్య

ఛేజింగ్‌లో తాను, గిల్ మంచి స్టార్ట్ ఇవ్వాల్సిందని SAతో 2వ T20లో ఓటమి తర్వాత IND కెప్టెన్ సూర్య అన్నారు. ప్రతిసారి అభిషేక్ మీద ఆధారపడలేమని, అతని ఆఫ్ డే అయినప్పుడు ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని చెప్పారు. తనతో పాటు గిల్, మిగతా బ్యాటర్లు ఇది అర్థం చేసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు. తానైనా బాధ్యత తీసుకొని మరింత సేపు బ్యాటింగ్ చేయాల్సిందని చెప్పారు. తొలి టీ20లోనూ గిల్, SKY పేలవ ప్రదర్శన కనబరిచారు.
News December 12, 2025
డిసెంబర్ 12: చరిత్రలో ఈ రోజు

1884: తెలుగు భాషాభిమాని సి.పి.బ్రౌన్ మరణం
1911: కోల్‌కతా నుంచి ఢిల్లీ భారతదేశ రాజధానిగా మార్పు
1931: సినీ నటి షావుకారు జానకి జననం
1940: NCP చీఫ్ శరద్ పవార్ జననం
1950: సూపర్ స్టార్ రజినీకాంత్ జననం
1981: క్రికెటర్ యువరాజ్ సింగ్(ఫొటోలో) జననం
– కెన్యా జాతీయ దినోత్సవం
News December 12, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


