News March 19, 2024

ఏపీలో భారీ వర్షాలు.. తెలంగాణలో మోస్తరు వానలు

image

నేటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో వానలు పడతాయని పేర్కొంది. ఉత్తర కోస్తాలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తెలంగాణలో 2 రోజులపాటు మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది.

Similar News

News December 8, 2025

‘వందేమాతరం’.. చర్చ ఈ అంశాలపైనే!

image

ఇవాళ పార్లమెంటులో జాతీయ గేయం ‘వందేమాతరం’పై చర్చ జరగనుంది. ఇప్పటివరకు వెలుగులోకి రాని అంశాలను చర్చలో వెల్లడించే అవకాశం ఉంది. బంకించంద్ర ఛటర్జీ రాసిన ఈ గీతం 1875 నవంబర్ 7న లిటరరీ జర్నల్ బంగదర్శన్‌లో ప్రదర్శించారు. 1882లో తన నవల ఆనందమఠ్‌లో దీనిని భాగం చేశారు. 1937లో ఈ గీతం నుంచి కీలక చరణాలను కాంగ్రెస్ తొలగించిందని మోదీ ఆరోపించారు. దీంతో ఇవాళ ఏ అంశాలను చర్చలో ప్రస్తావిస్తారోనని ఆసక్తికరంగా మారింది.

News December 8, 2025

మైసూరు పప్పు మాంసాహారమా?

image

పూజలు, వ్రతాల సమయంలో మైసూరు పప్పు తినకూడదంటారు. దీన్ని మాంసాహారంగా కూడా కొందరు భావిస్తారు. ఇందులో బద్ధకాన్ని కలిగించే తామస గుణాలుండటం అందుకు తొలి కారణం. అలాగే ఓ రాక్షసుడి రక్తం బొట్టు నుంచి ఈ పప్పు పుట్టిందని కొందరు పండితులు పేర్కొంటారు. పాల సముద్రాన్ని చిలకగా వచ్చిన అమృతాన్ని దొంగచాటుగా తాగిన సర్భాను తలను విష్ణు సుదర్శన చక్రంతో ఖండించాడట. ఆ రక్తపు చుక్కలు పడిన చోట ఇవి మొలిచాయని నమ్ముతారు.

News December 8, 2025

ఫైబ్రాయిడ్స్ లక్షణాలివే..

image

ఫైబ్రాయిడ్స్‌ ఉన్న మహిళల్లో నెలసరి స్రావంలో రక్తపు గడ్డలు కనిపించడం, నొప్పి ఉంటాయి. ఒకవేళ ఫైబ్రాయిడ్స్‌ చాలా పెద్దవిగా ఉంటే మూత్రాశయం మీద ఒత్తిడి పడి తరచూ మూత్రవిసర్జన చేయవలసి రావడం, మూత్రవిసర్జన పూర్తిగా జరగకపోవడం, జీర్ణ సమస్యలు వంటివి మొదలవుతాయి. కొన్ని రకాల ఫైబ్రాయిడ్లు గర్భసంచి లోపలి పొరల్లో ఏర్పడతాయి. వీటి వల్ల గర్భస్రావం జరిగిపోవడం, గర్భం దాల్చలేకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.