News August 13, 2025

భారీ వర్షాలు.. ఈ జాగ్రత్తలు తీసుకోండి!

image

తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇలాంటి సమయాల్లో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, చెట్లు, కరెంట్ స్తంభాల కింద నిల్చోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ‘నీరు నిలిచిన ప్రాంతాల్లో వాహనాలు నడపడం ప్రమాదకరం. సెల్లార్‌లోకి వరద చేరినప్పుడు షార్ట్ సర్క్యూట్ కాకుండా మెయిన్ ఆఫ్ చేయాలి. విష జ్వరాలు రాకుండా ఉండేందుకు కాచి చల్లార్చిన నీటిని తాగాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి’ అని చెబుతున్నారు.

Similar News

News March 13, 2026

ఆల్కహాల్ తాగితే నిద్ర పడుతుందా?.. డాక్టర్లు ఏమన్నారంటే!

image

మద్యం తాగితే త్వరగా నిద్ర పడుతుందని చాలామంది భావిస్తారు. కానీ అది ఒక పెద్ద భ్రమ అంటున్నారు వైద్యులు. ‘ఆల్కహాల్ వల్ల గాఢ నిద్ర తగ్గి, రాత్రివేళ తరచూ మెలకువ వస్తుంది. దీంతో మెదడుకు విశ్రాంతి ఉండదు. గురక & స్లీప్ అప్నియా వంటి శ్వాసకోశ సమస్యలు కూడా పెరుగుతాయి. ఫలితంగా ఉదయం లేవగానే నీరసంగా, అలసటగా ఉంటుంది. కాబట్టి మంచి నిద్ర కోసం మద్యానికి దూరంగా ఉండటమే బెటర్’ అని సూచిస్తున్నారు. SHARE IT

News March 13, 2026

గ్యాస్ దెబ్బ.. పెరిగిన టిఫిన్ల ధరలు!

image

ఎల్పీజీ కొరత సాకుగా చూపి హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో హోటళ్లు టిఫిన్ల ధరలు పెంచినట్లు తెలుస్తోంది. ప్రతి ఐటమ్‌పై ప్లేట్‌కు రూ.10 పెంచినట్లు వినియోగదారులు చెబుతున్నారు. అయితే ఇది తాత్కాలిక పెంపు మాత్రమేనని యాజమాన్యాలు అంటున్నాయి. ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్లు దొరకడం లేదని, ఇటీవల LPG ధర కూడా పెరగడంతో నిర్వహణ ఖర్చులు ఎక్కువైనట్లు పేర్కొంటున్నాయి. మరి మీ ఏరియాలోనూ టిఫిన్ల ధరలు పెరిగాయా? COMMENT

News March 13, 2026

నువ్వుల పంటలో బిహారీ గొంగళి పురుగులను ఎలా నివారించాలి?

image

నువ్వుల పంట తొలిదశలో చిన్న గొంగళి పురుగులు ఆకు పత్రహరితాన్ని గోకి తినడం వల్ల ఆకులు జల్లెడలా మారతాయి. ఎదిగిన గొంగళి పురుగులు మొగ్గలకు, పువ్వులకు, కాయలకు రంధ్రాలు చేసి విత్తనాలను తింటాయి. వీటి నివారణకు ఎకరాకు 16- 20 పక్షి స్థావరాలను, హెక్టారుకు ఒక దీపపు ఎరను అమర్చాలి. తొలుత లీటరు నీటికి వేపనూనె 5mlను, తర్వాతి దశలో లీటరు నీటికి క్లోరిఫైరిపాస్ 2.5ml లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.