News August 12, 2025
ఐదు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల 5 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ APలోని ఉమ్మడి ప.గో., కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు తదితర జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారముందని పేర్కొంది. అటు TGలోనూ HYD, KNR, MHBD, మహబూబ్ నగర్, NLG తదితర జిల్లాల్లో వర్షాలు పడతాయని వెల్లడించింది.
Similar News
News March 12, 2026
HYD: ఇది సంక్షోభం కాదు.. ప్రమాదం!

HYDలో పైపుల లీకేజీ సమస్యతో సంక్షోభం కాదు, భూగర్భ జలాలు వేగంగా పడిపోవడమే ప్రమాదం. పాతబస్తీ, ఖైరతాబాద్, అమీర్‌పేట్‌లో భూగర్భ జలాలు గతంతో పోలిస్తే 2.5మీటర్లకు పడిపోయాయి. భారీ నిర్మాణాలు, కాంక్రీటు జంగిల్‌గా మారుతున్న నగరంలో వర్షపు నీరు భూమిలోకి ఇంకడం లేదు. ఇంకుడు గుంతలు తప్పనిసరి అని చెబుతున్నా, పాత భవనాల్లో వీటి అమలు సున్నా. వేసవిలో ట్యాంకర్ల వ్యాపారం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
News March 12, 2026
పాపం జెన్‌జీలు

జెన్‌జీల జీవితం ఎమోషనల్ మూవీని తలపిస్తోంది. చదువుకోవాల్సిన సమయంలో కొవిడ్ లాక్డౌన్లు అడ్డుపడగా.. కెరీర్ మొదలుపెట్టే వేళ AI సవాలు విసురుతోంది. ఆర్థిక మాంద్యం, పెరిగిన ధరలతో సొంత ఇల్లు కలగానే మిగిలిపోతోంది. ఇక పెళ్లి చేసుకుందామంటే పెరుగుతున్న విడాకుల శాతం భయపెడుతోంది. అటు కెరీర్ టెన్షన్లు, ఇటు సామాజిక ఒత్తిళ్లతో ఈ తరం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వీరి పరిస్థితి ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’లా మారింది.
News March 12, 2026
PHOTO: నాగచైతన్య సిక్స్‌ప్యాక్

అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘వృషకర్మ’. ఈ సినిమాలో ‘అర్జున్’ అనే పవర్‌ఫుల్ పాత్ర కోసం చైతూ తన బాడీని పూర్తిగా మార్చేశారు. తాజాగా ఆయన జిమ్‌లో కసరత్తులు చేస్తున్న షర్ట్‌లెస్ ఫొటో వైరల్ అవుతోంది. కార్తీక్ దండు దర్శకత్వంలో హారర్, మైథలాజికల్ అంశాలతో వస్తున్న ఈ సినిమా గ్లింప్స్ ఇప్పటికే అంచనాలు పెంచేశాయి. ‘చైతూ పడ్డ కష్టానికి ఈ సారి హిట్ పక్కా’ అని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.


