News April 25, 2024

చిన్నాన్నను దారుణంగా చంపిన వారికి మద్దతా..?: వైఎస్ జగన్

image

ఏపీసీసీ చీఫ్ షర్మిలపై వైఎస్ జగన్ పులివెందుల సభలో పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘చిన్నాన్నను ఎవరు చంపారో ఆ దేవుడికి తెలుసు. బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మల్ని ఎవరు పంపించారో మీకు కనిపిస్తోంది. చిన్నాన్నను చంపింది నేనే అని తిరుగుతున్న హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరో ప్రజలు చూస్తున్నారు. చిన్నాన్నను అన్యాయంగా ఓడించిన వారితోనే చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతారా?’ అంటూ జగన్ ప్రశ్నించారు.

Similar News

News April 16, 2026

రాత్రి బ్రష్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా?

image

రాత్రి నిద్రకు ముందు బ్రష్ చేయడం ఎంతో ముఖ్యమని వైద్యులు సూచించారు. ‘రోజంతా తిన్న ఆహారం, చక్కెర దంతాలపై ఒక పొరలా పేరుకుపోతాయి. రాత్రి బ్రష్ చేయకపోతే గంటల తరబడి అలాగే ఉండి బాక్టీరియా పెరుగుతుంది. అది ఎనామెల్‌ను దెబ్బతీసి కావిటీస్, చిగుళ్ల సమస్యలకు దారి తీస్తాయి. నోటి దుర్వాసన పెరుగుతుంది. అందుకే రాత్రి భోజనం చేశాక నిద్ర పోయే ముందు బ్రష్ చేసుకోవాలి’ అని సూచిస్తున్నారు.
Share It

సీఎం రేవంత్ రెడ్డితో టీడీపీ మహిళా నేతలు

image

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ టీడీపీ మహిళా నేతలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ ఫొటోలను మాజీ మంత్రి పరిటాల సునీత సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లు ఉన్నారు. కాగా పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చ సందర్భంగా మహిళా నేతలు అక్కడికి వెళ్లారు.