News August 6, 2024
ఇకపై టీచర్లు, లెక్చరర్ల బదిలీలకు ప్రత్యేక కమిటీ

TG: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల టీచర్లు, లెక్చరర్ల బదిలీల కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించనుంది. ట్రాన్స్‌ఫర్ల వినతులను ఈ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. పైరవీలకు తావు లేకుండా నేరుగా లేదా ఆన్‌లైన్ ద్వారా ప్రత్యేక వెబ్‌పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీటిపై కమిటీ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా బదిలీలు, ఆన్ డ్యూటీ, డిప్యుటేషన్‌లపై ఆయా శాఖల ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారు.
Similar News
News December 12, 2025
డిసెంబర్ 12: చరిత్రలో ఈ రోజు

1884: తెలుగు భాషాభిమాని సి.పి.బ్రౌన్ మరణం
1911: కోల్‌కతా నుంచి ఢిల్లీ భారతదేశ రాజధానిగా మార్పు
1931: సినీ నటి షావుకారు జానకి జననం
1940: NCP చీఫ్ శరద్ పవార్ జననం
1950: సూపర్ స్టార్ రజినీకాంత్ జననం
1981: క్రికెటర్ యువరాజ్ సింగ్(ఫొటోలో) జననం
– కెన్యా జాతీయ దినోత్సవం
News December 12, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 12, 2025
ఇరిగేషన్ అధికారులపై NDSA ఛైర్మన్ అసంతృప్తి

TG: డ్యామ్‌ల భద్రతపై సమగ్ర నివేదిక ఇవ్వకపోవడం పట్ల ఇరిగేషన్ అధికారులపై NDSA ఛైర్మన్ అనిల్ జైన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదేశాలను బేఖాతరు చేయడంపై వారిని నిలదీశారు. 174 డ్యామ్‌ల భద్రతపై 3 నెలల్లోగా నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. నివేదికలను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. డ్యాముల ప్రస్తుత స్థితి, O&M MANUAL, డ్యామ్ దెబ్బతిన్న సందర్భంలో అత్యవసర ప్రణాళికలు ఈ నివేదికలో ఉండాలన్నారు.


