News March 4, 2025

ప్రియుడితో హీరోయిన్ తమన్నా బ్రేకప్?

image

లవ్ బర్డ్స్ తమన్నా, విజయ్ వర్మ తమ డేటింగ్‌కు బ్రేకప్ చెప్పినట్లు ‘పింక్ విల్లా’ కథనం ప్రచురించింది. కొన్ని వారాల క్రితమే విడిపోయిన వీరిద్దరూ స్నేహితులుగా కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారని తెలిపింది. 2023లో లస్ట్ స్టోరీస్-2 సందర్భంగా తమన్నా, విజయ్ మధ్య రిలేషన్‌షిప్ బయటి ప్రపంచానికి తెలిసింది. త్వరలో పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరుగుతున్న వేళ బ్రేకప్ వార్తలు రావడం అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది.

Similar News

News December 16, 2025

పోలీసుల అదుపులో 15 మంది మావోయిస్టులు

image

TG: కొమురం భీమ్(D) సిర్పూర్‌లో 15 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు సమాచారంతో వారు తలదాచుకున్న ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. లొంగిపోయేందుకే వారంతా ఛత్తీస్‌గఢ్ నుంచి ఇక్కడికి వచ్చినట్లు సమాచారం. మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం ‘ఆపరేషన్ కగార్’ కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇటీవల వివిధ రాష్ట్రాల్లో పలువురు మావోయిస్టు నేతలు లొంగిపోయిన సంగతి తెలిసిందే.

News December 16, 2025

జీడిమామిడిలో బూడిద తెగులు – నివారణ ఎలా?

image

జీడిమామిడి తోటల్లో పూత దశలో వివిధ రకాల తెగుళ్లు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా పొడి వాతావరణం ఉన్నప్పుడు బూడిద తెగులు ఎక్కువగా పూతను ఆశిస్తుంది. లేత చిగుర్లను, పూతను బూడిద తెగులు ఆశించి ఎండిపోయేలా చేసి పంటను నష్టపరుస్తుంది. ఫలితంగా దిగుబడి తగ్గుతుంది. దీని నివారణకు లీటరు నీటికి సల్ఫర్ 3 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. లేదా లీటరు నీటికి ట్రై డేమోర్ప్ 1.5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.

News December 16, 2025

కానుకల లెక్కింపులో టెక్నాలజీ వాడాలి: హైకోర్టు

image

AP: పరకామణి నేరం దొంగతనం కన్నా మించినదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ‘కానుకల లెక్కింపులో టెక్నాలజీ వినియోగించాలి. తప్పిదం జరిగితే తక్షణం అప్రమత్తం చేసేలా అది ఉండాలి. లెక్కింపును మానవరహితంగా చేపట్టాలి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి బాధ్యత ఉండదు. అందువల్లనే పరకామణి ఘటన జరిగింది’ అని పేర్కొంది. కానుకల లెక్కింపునకు భక్తులను ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. పరకామణిలో టేబుళ్లు ఏర్పాటుచేయాలని సూచించింది.