News October 8, 2025
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు

TG: బీసీ రిజర్వేషన్ల పెంపు GOపై విచారణ జరుపుతున్న హైకోర్టు.. బిల్లు పాస్ అయిందా అని ప్రశ్నించింది. అసెంబ్లీలో పాస్ అయిందని, గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉందని అడ్వకేట్ జనరల్ చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనా.. రిజర్వేషన్లు 50 శాతం మించితే ఎన్నికలు రద్దు అవుతాయనే నిబంధన ఉందని పిటిషనర్ల తరఫు లాయర్లు వాదించారు. వన్‌మెన్ కమిషన్ నివేదికను బహిర్గతం చేయలేదని పేర్కొన్నారు.
Similar News
News January 20, 2026
పెళ్లికి ముందు రక్తపరీక్షలు ఎందుకంటే?

ఆరోగ్యకరమైన వైవాహిక జీవితం కోసం, పుట్టబోయే పిల్లల భవిష్యత్తు కోసం పెళ్లికి ముందే జంటలు కొన్ని రక్త పరీక్షలు చేయించుకోవాలంటున్నారు నిపుణులు. తలసేమియా, సికిల్ సెల్ అనీమియా, హెచ్‌ఐవీ, హెపటైటిస్ B, C, సిఫిలిస్ వంటి ఇన్ఫెక్షన్లు, Rh ఫ్యాక్టర్‌ను గుర్తించడానికి రక్త పరీక్షలు కీలకం. భవిష్యత్తును ఆరోగ్యకరంగా, సంతోషంగా ప్లాన్ చేసుకోవడానికి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ముఖ్యమని ప్రతిఒక్కరూ గుర్తించాలి.
News January 20, 2026
తొలి EV ‘అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా’ ఆవిష్కరించిన టయోటా

భారత్‌లో టయోటా తన మొదటి EV ‘అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా’ కారును ఆవిష్కరించింది. LED డీఆర్‌ఎల్స్, ఆకర్షణీయమైన హెడ్ లాంప్స్, డిఫరెంట్ ఫ్రంట్ బంపర్ అమర్చారు. ఇంటీరియర్‌లో సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, పవర్డ్ డ్రైవర్ సీట్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్స్ ఉన్నాయి. 61kWh బ్యాటరీ వేరియంట్ 543KM, 49kWh వేరియంట్ 440KM మైలేజీ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ కారు ధరను ఇప్పటి వరకు ప్రకటించలేదు.
News January 20, 2026
50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం: CBN

AP: టెక్నాలజీ సహా వివిధ రంగాల్లోని మార్పులకు అనుగుణంగా పాలసీలు రూపొందిస్తామని CBN పేర్కొన్నారు. ‘దావోస్ సదస్సులో ప్రముఖుల ఆలోచనలతో రాష్ట్రాన్ని బిజినెస్ ఫ్రెండ్లీగా మారుస్తాం. అగ్రి, మెడికల్ రంగాల్లో డ్రోన్లను వినియోగిస్తాం. 2026లో డ్రోన్ అంబులెన్స్ లాంచ్ చేసే ఆలోచన ఉంది. 50L ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేపట్టాలని లక్ష్యం పెట్టుకున్నాం’ అని దావోస్‌లో CII బ్రేక్ ఫాస్ట్ సెషన్‌లో CM పేర్కొన్నారు.


