News August 24, 2024
ప్రజల దృష్టిని మరల్చేందుకు హై’డ్రామా’: BRS

TG: రైతు రుణమాఫీ, ఇతర సమస్యలపై ప్రజల దృష్టిని మరల్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ‘హైడ్రా’ నాటకానికి తెరలేపారని BRS విమర్శిస్తోంది. చెరువుల స్థలాల్లో నిర్మించిన మంత్రులు, కాంగ్రెస్ నేతల ఇళ్లను, ఫామ్ హౌస్‌లను కూల్చేస్తారా? అని ఆ పార్టీ నేతలు నిలదీస్తున్నారు. ఇవాళ కూల్చిన నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లోనే 2015లో రేవంత్ రెడ్డి తన కూతురి ఎంగేజ్‌మెంట్ జరిపారని గుర్తు చేస్తున్నారు.
Similar News
News January 24, 2026
పాడేరు: ‘ముందస్తు చర్యలు తీసుకోవాలి’

పాడేరు మండలం తలారిసింగి హైస్కూల్ గ్రౌండ్‌లో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ శ్రీపూజ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐటీడీఏలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. వేడుకలకు సంబంధించి ఎటువంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ సరఫరా, తాగునీరు ఏర్పాట్లు, విజిటర్స్ గ్యాలరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
News January 24, 2026
పాలమూరు: ఉచిత పోటీ పరీక్షల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్స్, బ్యాంకింగ్, ఆర్‌ఆర్‌బీ పరీక్షలకు ఇచ్చే 5 నెలల ఉచిత శిక్షణ కరపత్రాలను పాలమూరు వర్సిటీ వీసీ ప్రొ.జి.ఎన్. శ్రీనివాస్ ఆవిష్కరించారు. డిగ్రీ అర్హత ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు ఈనెల 30లోగా వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తారు.
వెబ్‌సైట్: https://www.tsstudycircle.co.in