News April 25, 2024

వినుకొండలో హైఓల్టేజ్ ఫైట్

image

పల్నాడు(D) వినుకొండలో ఎలక్షన్ హీట్ ఓ రేంజ్‌లో ఉంది. సిట్టింగ్ YCP MLA బొల్లా బ్రహ్మనాయుడు, TDP మాజీ MLA జీవీ ఆంజనేయుల మధ్య మాటల యుద్ధం పాలిటిక్స్‌ను హీటెక్కిస్తోంది. గత ఎన్నికల్లో తలపడిన వీరు మరోసారి పోటీకి సై అంటున్నారు. ఈసారి ఇద్దరిలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. గతంలో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో 1999లో TDP ఖాతా తెరిచింది. 2009, 14లో TDP వరుసగా గెలువగా 2019లో వైసీపీ బోణీ కొట్టింది.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News April 13, 2026

సెన్సస్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్, జైలు శిక్ష

image

AP: సెన్సస్-2027లో భాగంగా రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి 30 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్‌కు అవకాశం ఉంటుంది. మే 1 నుంచి క్షేత్రస్థాయి గణన ప్రారంభం కానుంది. అధికారులు జనాభా లెక్కల కోసం వచ్చినప్పుడు ఇళ్ల యజమానులు అనుమతించాలని ప్రభుత్వం సూచించింది. ‘వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమివ్వాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా లేదా జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఇదే రూల్ అధికారులకూ వర్తిస్తుంది’ అని పేర్కొంది.

News April 13, 2026

ఇరాన్ పోర్టులను దిగ్బంధిస్తాం: అమెరికా

image

అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఇరాన్ పోర్టుల్లోకి వెళ్లే, వచ్చే అన్ని నౌకలను దిగ్బంధిస్తామని US సైన్యం ప్రకటించింది. ‘ఏప్రిల్ 13న 10AM(US టైం ప్రకారం)కు ఇది మొదలవుతుంది. ఇరాన్ పోర్టులు, దాని తీర ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించే అన్ని దేశాల నౌకలకు వర్తిస్తుంది. ఇరానేతర ఓడరేవులకు వెళ్లే, హార్ముజ్ జలసంధి గుండా వచ్చే ఇతర నౌకలకు ఆటంకం కలిగించబోం’ అని ట్వీట్ చేసింది.

News April 13, 2026

ఆంధ్రా కశ్మీర్ అనంత.. మనదగ్గరా యాపిల్ పంట

image

AP: ఎక్కువగా చల్లని ప్రదేశాల్లోనే పండే యాపిల్ పంట ఇప్పుడు రాయలసీమకూ విస్తరించింది. అనంతపురం(D) గార్లదిన్నె, కుందుర్పి, పెద్దపప్పూరు మండలాల్లో రైతులు సాగు చేస్తున్నారు. 15 ఎకరాల్లో తోటలు వేశారు. డిసెంబర్‌లో పూతకు వచ్చిన చెట్లు ఇప్పుడు కాయలు కాసి కోతకొచ్చాయి. ఎకరానికి టన్ను దిగుబడి వచ్చిందని, కిలో ₹120-170 పలుకుతోందని రైతులు చెబుతున్నారు. ‘అనంత యాపిల్’ పేరుతో గిఫ్ట్ ప్యాకులుగానూ విక్రయిస్తున్నారు.