News April 30, 2024

కూటమి మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు

image

AP: టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను ఆయా పార్టీల అధినేతలు రిలీజ్ చేశారు. వాటిలో ముఖ్యమైనవి..
✒ ఎంత మంది పిల్లలున్నా తల్లికి వందనం కింద ఒక్కొక్కరికి ఏటా రూ.15,000
✒ దీపం పథకం కింద ఏటా 3 సిలిండర్లు ఫ్రీ
✒ రైతులకు ఏడాదికి రూ.20వేల పెట్టుబడి సాయం
✒ నిరుద్యోగులకు నెలకు రూ.3వేల భృతి
✒ ఆడబిడ్డ నిధి కింద 18-59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1,500 ✒ మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం

Similar News

News December 7, 2025

వైట్ హెడ్స్‌ని ఇలా వదిలిద్దాం..

image

శీతాకాలంలో ఎదురయ్యే చర్మ సమస్యల్లో వైట్ హెడ్స్ ఒకటి. వీటిని తగ్గించడానికి కొన్ని ఇంటి చిట్కాలు..* వేపాకులు, పసుపు పేస్ట్ చేసి దాన్ని వైట్ హెడ్స్‌పై రాసి పావుగంట తర్వాత కడిగేస్తే చాలు. * సెనగపిండి, పెసర పిండి, పాలు, కాస్త నిమ్మరసం కలిపి పేస్ట్ చేసి 20నిమిషాల పాటు ముఖానికి ఉంచి కడిగేయాలి. * వంటసోడాలో నీళ్లు కలిపి ఈ మిశ్రమాన్ని వైట్‌హెడ్స్‌పై రాయాలి. కాసేపటి తర్వాత నీళ్లతో కడిగేయాలి.

News December 7, 2025

6వేల మందితో మూడంచెల భద్రత: సీపీ సుధీర్ బాబు

image

TG: గ్లోబల్ సమ్మిట్‌కు భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. ‘6 వేల మంది పోలీసులతో మూడంచెల భద్రత, వెయ్యి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. 2 రోజుల తర్వాత పబ్లిక్‌కు అనుమతి ఉంటుంది. డెలిగేట్స్‌కు పైలట్ వాహనాలను ఏర్పాటు చేశాం. సమ్మిట్ జరిగే రోజుల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. శ్రీశైలం నుంచి వచ్చే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి’ అని పేర్కొన్నారు.

News December 7, 2025

తల్లయిన హీరోయిన్ సోనారిక

image

టాలీవుడ్ హీరోయిన్ సోనారిక తల్లి అయ్యారు. ఈ నెల 5న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు ఇవాళ ఆమె ఇన్‌స్టాలో వెల్లడించారు. ‘దేవోం కే దేవ్ మహాదేవ్’ సీరియల్‌లో పార్వతీదేవిగా నటించిన ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో జాదూగాడు, స్పీడున్నోడు, ఈడోరకం ఆడోరకం సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. గత ఏడాది వ్యాపారవేత్త వికాస్ పరాశర్‌ను వివాహం చేసుకున్నారు.