News March 27, 2024
నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు

* TS: ఎమ్మెల్సీ కవితకు జుడీషియల్ కస్టడీ
* AP: రెండు రోజులు ఆలస్యంగా పెన్షన్ పంపిణీ
* TS: ఈ కరువు BRS తెచ్చిందే: మంత్రి సీతక్క
* AP: అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ముత్యాలనాయుడు
* TS: సీఎం రేవంత్ BJPలో చేరతారు: కేటీఆర్
* TS: కేంద్రానికి పెట్రోల్ పంప్ డీలర్ల అల్టిమేటం
* IPL: గుజరాత్‌పై చెన్నై విజయం
* FIFA WC క్వాలిఫయర్స్‌లో అఫ్గాన్ చేతిలో ఇండియా ఓటమి
Similar News
News February 10, 2026
గుడ్డులోని పచ్చసొనతో కొలెస్ట్రాల్ పెరుగుతుందా?

గుడ్డు పచ్చసొన (Yolk) తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలామంది ఎగ్ వైట్ మాత్రమే తింటారు. అయితే పచ్చసొనలో విటమిన్ A, E, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి కీలక పోషకాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. మన శరీరంలోని 85% కొలెస్ట్రాల్‌ను కాలేయమే ఉత్పత్తి చేస్తుంది. ఆహారం ద్వారా వచ్చే కొలెస్ట్రాల్ ప్రభావం తక్కువే. పచ్చసొనలోని పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.
News February 10, 2026
BOB క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

BOB క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్ మేనేజర్, AVP ఫైనాన్స్& అకౌంట్స్, స్టేట్ హెడ్ రిటైల్ బ్రోకింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు నేటి నుంచి ఫిబ్రవరి 28 వరకు careers@bobcaps.in ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. పోస్టును బట్టి డిగ్రీ, PG/CA/MBA అర్హతతో పాటు పనిఅనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.bobcaps.in
News February 10, 2026
ఇండియా-పాక్ మ్యాచ్.. విమాన టికెట్లకు రెక్కలు

T20 ప్రపంచకప్‌లో ఇండియాతో మ్యాచ్ విషయంలో <<19097488>>పాక్ యూటర్న్<<>> తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరగనున్న కొలంబోకు విమాన టికెట్ల ధరలు భారీగా ఎగిశాయి. ఇండియాతో ఆడతామని పాక్ ప్రకటించిన నిమిషాల్లోనే ఏకంగా రూ.10 వేలు పెరిగాయని సమాచారం. ప్రస్తుతం పోను రాను టికెట్ ధర రూ.60 వేలుగా ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్‌కు ఇంకా 5 రోజులుండటంతో ఈ రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.


