News October 6, 2025
HMDA పరిధిలో సుమారు 3,600 చెరువులు

HYD నడిబొడ్డు నుంచి సర్కిల్‌లో ORR వరకు మొత్తం HMDA పరిధిలో సుమారుగా 3,600 చెరువులు ఉన్నట్లుగా CE రవీందర్ తెలియజేశారు. అనేక ప్రాంతాల్లో చెరువుల అభివృద్ధి నత్తనడకన సాగుతోందని పలువురు ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన పలు వివరాలు తెలిపారు. చెరువుల సమీపంలో ఉన్న పార్కులను అభివృద్ధి చేసి, లోకల్ బాడీకి అందజేయడం తమ విధి అని చెప్పారు.
Similar News
News January 20, 2026
రియల్ ఎస్టేట్ జాతకాన్ని మార్చేయబోతున్న గోదావరి!

‘ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడ సిరి ఉంటుంది’ అనే సామెత ముత్తంగి, ఘన్‌పూర్ బెల్ట్‌లో నిజం కాబోతోంది. రూ.2,400 కోట్లతో ప్యాకేజీ-2 పనులు మొదలవ్వగానే ఆ ఏరియా అంతా ఇన్వెస్ట్‌మెంట్లకు అడ్డాగా మారనుంది. IT కారిడార్‌కు ఆనుకుని ఉన్న ఈ ప్రాంతాల్లో నీటి భద్రత లభించడంతో భూముల ధరలకు రెక్కలు రావడం ఖాయం. మల్లన్న సాగర్ నుంచి వచ్చే గోదావరి జలాలు వెస్ట్ HYDను మరో స్థాయికి తీసుకెళ్లే ‘ఎకనామిక్ బూస్టర్’.
News January 20, 2026
కూకట్‌పల్లి: భర్తను చంపిన భార్య

కూకట్‌పల్లిలోని ఓ కాలనీలో అనుమానాస్పద మృతిగా నమోదైన కేసు హత్యగా తేలింది. సుధీర్ రెడ్డి (44)ని భార్య ప్రసన్న చున్నీతో ఉరేసి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మృతుడి సోదరి సునీత ఇచ్చిన ఫిర్యాదుతో ఈ హత్య ఉదాంతం బయటకొచ్చింది. నిందితురాలిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
News January 20, 2026
హైదరాబాద్‌కు అండర్ గ్రౌండ్ రివర్

HYD దాహాన్ని తీర్చడానికి ప్రభుత్వం రూ.7,360 కోట్లతో ‘అండర్ గ్రౌండ్ రివర్’ను సృష్టిస్తోంది. ఇప్పటిదాకా మనం విన్నది కేవలం పైప్‌లైన్‌ల గురించి మాత్రమే. కానీ ఈ ప్రాజెక్టు అసలు ఉద్దేశం సిటీకి 50 ఏళ్ల వాటర్ గ్యారెంటీ ఇవ్వడం. 50 TMC మల్లన్నసాగర్‌ను ఒక భారీ ‘పవర్ బ్యాంక్’లా వాడుకుంటూ అందులోని 20 TMCలను సిటీకి మళ్లించబోతున్నారు. వాతావరణం ఎలా ఉన్నా నగరం చుట్టూ ఉన్న రిజర్వాయర్లు ఎప్పుడూ కళకళలాడుతూనే ఉంటాయి.


