News November 7, 2025

HNK: ఈనెల 10న టాస్క్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూస్

image

తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్(TASK) ఆధ్వర్యంలో హనుమకొండ చైతన్య యూనివర్సిటీలోని రీజినల్ ఆఫీసులో నవంబర్ 10న కస్టమర్ సర్వీస్ అసోసియేటివ్, కంటెంట్ మాడరేటర్, అనాలసిస్ట్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. 2024, 25 సంవత్సరాల్లో B.TECH, BE/B.Sc/B.Com/BCA, BA పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్వ్యూకి హాజరుకావాలని, ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని టాస్క్ ప్రతినిధులు సూచించారు.

Similar News

News January 18, 2026

తెర్పోల్ చెరువులో దూకి వ్యక్తి మృతి

image

కొండాపూర్‌కు చెందిన దొబ్బల రాజు గత నెల 31వ తేదీన గ్రామ శివారులోని దర్గాకు వెళ్లి తిరిగి రాలేదు. వెతికిన ఆచూకీ లభించకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఆదివారం మధ్యాహ్నం తెర్పోల్ శివారులో చెరువులో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

News January 18, 2026

జమ్మూకశ్మీర్‌లో కాల్పులు.. ఏడుగురు సైనికులకు గాయాలు

image

జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో టెర్రరిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు సైనికులు గాయపడినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఛత్రూ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని వెల్లడించాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించామని చెప్పాయి. ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నాయి.

News January 18, 2026

మేడారం: జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు కమిషన్‌!

image

రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు రిటైర్డ్‌ జడ్జితో కమిషన్‌ వేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. మేడారంలో ఆదివారం రాత్రి సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన భేటీలో మొత్తం 18 అంశాలపై సుదీర్ఘ చర్చ జరుగుతోంది. 12 అంశాలపై చర్చ పూర్తవ్వగా.. మరో 6 అంశాలపై భేటీ కొనసాగుతోంది. పొట్లాపూర్ ఎత్తిపోతల పథకానికి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణానికి ఆమోదం తెలిపింది.