News September 13, 2025

HNK: ఈనెల 14న ఎన్డీఏ & సీడీఎస్ పరీక్ష

image

ఈనెల 14న నిర్వహించనున్న నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ), కంబైన్డ్ డిఫెన్స్ అకాడమీ సర్వీసెస్(సీడీఎస్) పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి వై.వి.గణేశ్ అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాలో ఏర్పాటు చేసిన పలు పరీక్షా కేంద్రాల్లో ఎన్డీఏ, సీడీఎస్ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు.

Similar News

News December 11, 2025

బోధన్: అత్తపై కోడలు ఘన విజయం

image

బోధన్ మండలం లంగ్డాపూర్‌లో అత్తపై కోడలు విజయం సాధించింది. అత్త బెల్లిడీగ గంగామణి పై కోడలు బెల్లిడీగ శోభారాణి ఘన విజయం సాధించింది. ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు జరగగా శోభారాణి 232 ఓట్ల తేడాతో గెలుపొందారు. గ్రామంలో మొత్తం 424 ఓట్లు ఉండగా గంగామణికి 93 ఓట్లు, శోభారాణికి 325 ఓట్లు పోలయ్యాయి.

News December 11, 2025

మెదక్: 88.46% ఓటింగ్‌గా తేల్చిన అధికారులు

image

మెదక్ జిల్లాలో ఆరు పంచాయతీలలో జరిగిన ఎన్నికలలో 88.46 శాతం ఓట్లు పోలైనట్లు జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య తెలిపారు. 1,63,148 ఓటర్లు ఉండగా 1,44,323 ఓట్లు పోలైనట్లు వివరించారు. ఎన్నికలలో 89.68% పురుషులు, 87.34 శాతం మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 69,933 మంది పురుషులు, 74 వేల 388 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు పేర్కొన్నారు.

News December 11, 2025

టాస్ గెలిచిన భారత్

image

ముల్లాన్‌పూర్ వేదికగా రెండో టీ20లో భారత్-సౌత్ ఆఫ్రికా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.
IND ప్లేయింగ్ XI: అభిషేక్, గిల్, సూర్యకుమార్ యాదవ్(C), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, దూబే, జితేశ్ శర్మ, అర్ష్‌దీప్, అక్షర్ పటేల్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి
SA ప్లేయింగ్ XI: రీజా, డికాక్, మార్క్రమ్(C), బ్రెవిస్, మిల్లర్, ఫెరీరా, లిండే, జాన్సెన్, సిపామ్లా, లుంగి ఎంగిడి, బార్ట్‌మన్