News September 12, 2025

HNK: కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వండి: కలెక్టర్

image

ప్రాథమిక, ఉప ఆరోగ్య కేంద్రాల నిర్మాణంలో జాప్యం చేసే కాంట్రాక్టర్లకు వెంటనే నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీవోసీ కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఆసుపత్రుల నిర్మాణ పనులు, వైద్య సిబ్బంది సమయపాలన, ఖాళీ పోస్టుల భర్తీ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు.

Similar News

News December 13, 2025

ఈనెల 14 నుంచి జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు: SE

image

జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు ​నిర్వహిస్తున్నట్లు APEPDCL SE కె.తిలక్ కుమార్ ప్రకటించారు. జిల్లాలో విద్యుత్ పొదుపుపై వినియోగదారులకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖన పోటీలు, వినియోగదారులకు స్టార్ రేటెడ్ గృహెూపకరణాల ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఇంజనీరింగ్ కళాశాలలో వర్క్ షాపులు నిర్వహిస్తామన్నారు.

News December 13, 2025

HNK: ఓటేయడానికి వెళ్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి

image

HYD నుంచి ఓటేయడానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవాపూర్ వద్ద జాతీయ రహదారిపై జరిగింది. హన్మకొండ(D) ఐనవోలు(M) నందనానికి చెందిన బుర్ర కళ్యాణ్(27), ఐటీ ఉద్యోగి నవీన్(27) HYD నుంచి రెండో దశ పోలింగ్‌లో ఓటు వేయడానికి వస్తున్నారు. ఈ క్రమంలో రాఘవాపూర్ వద్ద జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం వారి బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

News December 13, 2025

ఉప్పల్‌‌లో ఫుట్‌బాల్ మ్యాచ్.. CM, మెస్సీ ఆడేది అప్పుడే!

image

​సింగరేణి RR-9 వర్సెస్ అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ మధ్య ఉప్పల్‌లో మ్యాచ్ షురూ అయ్యింది. 7v7 ఎగ్జిబిషన్/సెలిబ్రిటీ మ్యాచ్ జరగుతుంది. ఈ మ్యాచ్ చివర్‌లో తెలంగాణ CM రేవంత్ రెడ్డి కూడా గ్రౌండ్‌లోకి దిగి మెస్సీతో కలిసి ఆడనున్నారు. అంతకుముందు మెస్సీ, లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ కలిసి చిన్నపిల్లలకు ఫుట్‌బాల్ క్లినిక్ నిర్వహించి, వాళ్లకు టెక్నిక్స్ నేర్పిస్తారు. ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు ఇది పండగే.