News November 16, 2025
HNK: కుటుంబ బంధాలు బలోపేతం: మంత్రి కొండా సురేఖ

వన భోజనాలతో ప్రజల మధ్య సాన్నిహిత్యం పెరిగి, కుటుంబ బంధాలు మరింత బలపడతాయని మంత్రి కొండా సురేఖ అన్నారు. చింతల్ గ్రౌండ్‌లో జరిగిన పద్మశాలి కార్తీకమాస వనభోజన మహోత్సవానికి ఆమె హాజరయ్యారు. పూర్వీకులు ఏర్పరచిన సామూహిక జీవన విధానాన్ని అలవాటు చేసేందుకు ఉద్దేశించినదే ఈ వనభోజన కార్యక్రమం అని, ఆచారాలను, సంప్రదాయాలను కొనసాగించాలని ఆమె కోరారు.
Similar News
News January 12, 2026
‘సేవలందిస్తున్న వారిని గుర్తించి అవార్డులకు ప్రతిపాదించాలి’

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‍భవన్‌లో నిర్వహించే కార్యక్రమంలో సామాజిక సేవలో పాల్గొనే వారికి అవార్డుల ప్రధానం జరుగుతుందని జేసీ భావన చెప్పారు. సోమవారం బాపట్ల కలెక్టరేట్‌లో ఆమె అధికారులతో సమావేశం నిర్వహించారు. సామాజిక సేవలో పాల్గొనే ఉద్యోగులు, వివిధ సంస్థలు, సామాజిక సేవలు అందిస్తున్న వారిని గుర్తించి అవార్డులకు ప్రతిపాదించాలని ఆదేశించారు.
News January 12, 2026
గుమ్మానికి ఎదురుగా కిటికీ ఉండవచ్చా?

ఇంటి గుమ్మానికి ఎదురుగా కిటికీ ఉండటం మంచిదంటున్నారు వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు. ఈ నిర్మాణం బయట నుంచి వచ్చే సహజ గాలి, వెలుతురును అన్ని గదుల్లోకి ప్రసరించేలా చేస్తుందంటున్నారు. ‘ఇది గదిలో ఉండే వారికి మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఇల్లు ఎప్పుడూ తాజాదనంతో ఉంటుంది. ఇంట్లో ప్రతికూలత తగ్గి, గృహస్థులు ఉత్సాహంగా తమ జీవితాన్ని గడపడానికి దోహదపడుతుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 12, 2026
సంగారెడ్డి: ‘ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలి’

జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నాణ్యమైన విద్య అందించేందుకు ఈ పాఠశాలను ఏర్పాటు చేస్తుందని చెప్పారు.


