News February 15, 2025
HNK: గురుకుల విద్యార్థులకు అస్వస్థత

తెలియక ఓ చెట్టు పండ్లను తిన్న గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.HNK జిల్లా హసన్‌పర్తి జ్యోతిరావు ఫూలే బీసీ గురుకుల పాఠశాలలో శుక్రవారం పలువురు విద్యార్థులు ఇదే గురుకులంలోని ఒక చెట్టు పండ్లను తిన్నారు. దీంతో ఆరుగురు విద్యార్థులు వాంతులు, కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రిలో చేర్పించారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
Similar News
News April 17, 2026
VKB: వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు వహించండి: కలెక్టర్

ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దన్నారు. భూగర్భ జలాలు తగ్గుతున్నందున నీటిని పొదుపుగా వాడటంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎండల దృష్ట్యా అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
News April 17, 2026
అనకాపల్లి: కేంద్రీయ విద్యాలయానికి 200 మంది ఎంపిక

అనకాపల్లి పరిసర ప్రాంతాలలో కేంద్రీయ విద్యాలయం ద్వారా ఎంపికైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు సేకరించడం జరుగుతుందని ప్రిన్సిపల్ గౌరీ శంకర్ గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్రీయ విద్యాలయం ద్వారా 200 మంది విద్యార్థులు ఎంపిక అవ్వడం జరిగిందని తెలిపారు. ఈ ఎంపిక అయినా విద్యార్థులు వివరాలు కేంద్రీయ విద్యాలయం నోటీస్ బోర్డులో ఏర్పాటు చేశామన్నారు. జూన్24 లోపు దరఖాస్తులు ఇవ్వాలి అన్నారు.