News November 30, 2025
HNK: నోట్లకు అమ్ముడుపోయే ఓట్లు మా ఇంట్లో లేవు!

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం మడిపల్లి గ్రామంలో ఒక కుటుంబం ఇంటి ముందుంచిన ఫ్లెక్సీ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. “నోట్లకు అమ్ముడుపోయే ఓట్లు మా ఇంట్లో లేవు” అని ఆ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో డబ్బు కోసం ఓటు వేయకుండా ప్రజల్లో అవగాహన పెంచుతూ, గ్రామస్థులకు ఈ ఫ్లెక్సీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
Similar News
News February 10, 2026
స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ సెంటర్లను పరిశీలించిన కలెక్టర్

మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల సాధారణ ఎన్నికలు 2026లో భాగంగా మేడ్చల్ జిల్లాలోని మూడుచింతలపల్లి, ఆలియాబాద్, ఎల్లంపేట్ మున్సిపాలిటీలలో ఎన్నికలకు ఉపయోగించే సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను సాధారణ ఎన్నికల పరిశీలకులు నిర్మల కాంతి వెస్లీతో కలిసి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మనూ చౌదరి పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లతోపాటు స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ సెంటర్ల ఏర్పాట్లను తనిఖీ చేశారు.
News February 10, 2026
వైరా: మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై సీపీ నిఘా

వైరా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో CP సునీల్ దత్ మంగళవారం పట్టణంలో పర్యటించారు. ముందుగా వైరాలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను సందర్శించి, ఎన్నికల సామగ్రి పంపిణీ, భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న సీపీ.. ఎన్నికల వేళ శాంతిభద్రతల పరిరక్షణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News February 10, 2026
కడప: డిగ్రీ పరీక్షలు రాసేందుకు ఇదే చివరి అవకాశం

యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ కళాశాలల విద్యార్థులు పెండింగ్ సబ్జెక్టులను ఒకేసారి రాసుకునే అవకాశాన్ని కల్పించినట్లు సీఈ ప్రొ. కె.ఎస్.వి. కృష్ణారావు తెలిపారు. 2010 నుంచి 2019 సంవత్సరాలలో డిగ్రీ చదివి పాస్ కాని వారికి ఇదే చివరి అవకాశమన్నారు. మార్చి 16వ తేదీ లోపు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు YVU అధికార వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.


