News April 26, 2024

HNK: ప్రియుడు, అక్కతో కలిసి చోరీకి పాల్పడ్డ మహిళ

image

తాను పనిచేస్తున్న యజమాని ఇంటిలోనే ప్రియుడు, అక్కతో కలిసి చోరికి పాల్పడింది ఓ మహిళ. ఈ ముగ్గురిని నిందితులను శుక్రవారం హనుమకొండలోని సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి సుమారు రూ.38 లక్షల విలువ గల 470 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను, దోచుకున్న సొమ్మును వరంగల్ పోలీస్ కమిషనరేట్ అంబర్ కిషోర్ ఝా ఎదుట పోలీసులు ప్రవేశపెట్టారు.

Similar News

News April 12, 2026

ఇంటర్ సెకండియర్ RESULTS.. వరంగల్‌కు 34వ ర్యాంక్

image

ఇంటర్ 2nd ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. వరంగల్(D)లో రెగ్యులర్ విద్యార్థులు 4678 మంది పరీక్షలు రాయగా 2844 మంది పాసై 60.80 శాతంతో స్టేట్‌లో 34వ స్థానంలో ఉంది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 737 మందికి 545 మంది పాసై 73.95 శాతంతో 17వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 679 మందికి 193 మంది పాసై 28.42%తో 29వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 70 మందికి 40మంది పాసై 57.14%తో 9వ స్థానం వచ్చింది.

News April 12, 2026

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు.. వరంగల్‌కు 30వ ర్యాంక్

image

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. వరంగల్ జిల్లాలో రెగ్యులర్ ఫస్టియర్ విద్యార్థులు 5211 మంది పరీక్ష రాయగా 2752 మంది పాసై 52.81 శాతంతో స్టేట్‌లో 30వ ర్యాంక్‌లో నిలిచింది. ఇక ఒకేషన్‌లో 793 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 428 మంది విద్యార్థులు పాసై 53.97 శాతంతో స్టేట్‌లో 28వ స్థానంలో నిలిచింది.