News December 1, 2025

HNK: రూ.15 వేలు అకౌంట్‌లో పడ్డాయా..!

image

మొంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన వరద బాధితులకు ఇంటికి రూ.15 వేల చొప్పున ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి వరంగల్‌లో ప్రకటించి నెల రోజులు దాటింది. HNK అమరావతినగర్, సమ్మయ్యనగర్, TV టవర్, WGL రామన్నపేట, NTR నగర్ లాంటి ప్రాంతాల్లో వరద ముంపునకు గురైన 6,500 ఇళ్లకు రూ.15 వేల చొప్పున ఇస్తామని ప్రకటించారు. ఇందుకు రూ.12 కోట్లను విడుదల చేశారని చెప్తున్నా, ఇప్పటి వరకు అకౌంట్లో డబ్బులు జమ కాలేదని బాధితులంటున్నారు.

Similar News

News February 7, 2026

‘హగ్స్, ఫొటో సెషన్స్ పని చేయలేదు’.. ట్రేడ్ డీల్‌పై కాంగ్రెస్ సెటైర్లు

image

అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ‘ఇకపై రష్యా ఆయిల్‌ను ఇండియా కొనదు. కొంటే 25% పెనాల్టీ విధిస్తామని US హెచ్చరించింది. US రైతుల కోసం దిగుమతి సుంకాలను ఇండియా తగ్గిస్తుంది. అమెరికా ఎక్స్‌పోర్ట్స్ 3 రెట్లు పెరుగుతాయి. భారత వస్తువులపై ఎక్కువ సుంకాలు పడతాయి. హగ్స్, ఫొటో సెషన్స్ పెద్దగా పని చేయలేదు. హౌడీ మోదీపై నమస్తే ట్రంప్‌దే పైచేయి’ అని జైరామ్ రమేశ్ ట్వీట్ చేశారు.

News February 7, 2026

మున్సిపల్ ఎన్నికల నగారా.. పటిష్ఠ నిఘా

image

ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కలెక్టర్ అనుదీప్ జిల్లా ఎన్నికల అధికారిగా పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల కోడ్‌ను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు ప్రత్యేక నిఘా బృందాలను రంగంలోకి దింపారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, పారదర్శకంగా పోలింగ్ జరిగేలా క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

News February 7, 2026

నారాయణపేటలో ‘త్రిముఖ’ పోరు

image

నారాయణపేట మున్సిపల్ పీఠం దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. బీజేపీ గెలుపు కోసం కర్ణాటక, మహారాష్ట్రల నుంచి మాజీ మంత్రులు రంగంలోకి దిగగా.. కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి బృందం వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తోంది. ఇక బీఆర్ఎస్ బాధ్యతను మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, యాదగిరి రెడ్డి భుజాన వేసుకున్నారు. అగ్రనేతల ప్రచారంతో పేటలో ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది.