News November 19, 2025

HNK: లోన్ యాప్ వేధింపులు.. యువకుడి సూసైడ్

image

హనుమకొండ టీవీ టవర్ కాలనీకి చెందిన నవీన్ అనే యువకుడు లోన్ యాప్ వేధింపులకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చైనాకు చెందిన యాప్‌లో లోన్ తీసుకొని చెల్లించకపోవడంతో, అతడి ఫొటోలను మార్ఫింగ్ చేసి వాట్సాప్‌లో పోస్ట్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన నవీన్, వేధింపులు తట్టుకోలేక వడ్డేపల్లి-దేవన్నపేట మధ్యలోని బావిలో దూకి బలవన్మరణం చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

Similar News

News January 17, 2026

MBNR: ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశాలకు అవకాశం

image

2026-27 విద్యా సంవత్సరానికి గాను Model Schools Admission Test (MSAT) కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. అభ్యర్థులు https://www.tsmodelschools.com వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఉమ్మడి జిల్లాలోని 8 ఆదర్శ పాఠశాలలకు గాను ఒక్కో పాఠశాలలో 100 సీట్లు చొప్పున ఖాళీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

News January 17, 2026

ప్రేమను పెంచే సింపుల్ ట్రిక్!

image

దంపతుల మధ్య చిలిపి తగాదాలు, ఒకరినొకరు ఆటపట్టించుకోవడం వల్ల వారి బంధం మరింత బలపడుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి సరదా టీజింగ్స్.. భాగస్వాముల మధ్య ఉన్న భయాన్ని పోగొట్టి, చనువును పెంచుతుంది. ఒకరిపై ఒకరు జోకులు వేసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, గొడవలను కూడా నవ్వుతూ పరిష్కరించుకోవచ్చు. అయితే ఈ హాస్యం కేవలం ఆనందం కోసమే ఉండాలి తప్ప, అవతలి వ్యక్తిని కించపరిచేలా ఉండకూడదు. share it

News January 17, 2026

కాకినాడలో పవన్ ‘న్యూ లుక్’

image

జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సరికొత్త వేషధారణతో అభిమానులను మంత్రముగ్ధులను చేశారు. ఈనెల 9న పిఠాపురం, కాకినాడ పర్యటనలో ప్యాంటు, స్వెటర్ ధరించి సాదాసీదాగా కనిపించిన ఆయన, శనివారం గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి మాత్రం పూర్తి ‘స్మార్ట్’ లుక్‌లో విచ్చేశారు. గడ్డం ట్రిమ్ చేసుకొని, సంప్రదాయ కుర్తా పైజామాలో మెరిసిపోతున్న పవన్‌ను చూసి అభిమానులు జేజేలు పలికారు.