News December 1, 2025

HNK: సర్పంచ్ ఎన్నికలు.. సోషల్ మీడియాపై అభ్యర్థుల ఫోకస్

image

జిల్లాలో స్థానిక ఎన్నికల సందడి మొదలైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడుతూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న నేపథ్యంలో సర్పంచ్‌కు పోటీ చేయాలనుకునే అభ్యర్థులు సోషల్ మీడియాపై ప్రత్యేక ఫోకస్ పెట్టి తమను గెలిపిస్తే చేసే పనులు, ఎజెండాలను స్టేటస్, గ్రూప్స్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం ఏ మాత్రం ఉంటుందో చూడాల్సి ఉంది.

Similar News

News February 18, 2026

విశాఖ సాగర్ తీరంలో జెట్ ఫైటర్ల విన్యాసాలు (వీడియో)

image

అంతర్జాతీయ ప్లేట్ రివ్యూలో భాగంగా భారత వైమానిక దళానికి చెందిన జెట్ ఫైటర్లు విశాఖ సముద్రతీరంలో అద్భుత విన్యాసం చేశాయి. ఒకేసారి ఏడు జెట్ ఫైటర్లు సముద్రానికి దగ్గరగా వెళ్తూ పల్టీలు కొట్టడం, బాంబులు వదిలే విన్యాసాలు నిర్వహించారు. తీరానికి శత్రుదేశం నౌకలు ఏమైనా చేరుకుంటే వాటిని ఎలా పేల్చాలో కళ్లకు కట్టినట్లు చూపించారు.

News February 18, 2026

నిజామాబాద్: యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం ఫకీరాబాద్ సమీపంలో బైక్ యాక్సిడెంట్ జరిగి గణపతి అనే వ్యక్తి మరణించాడని ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. ఈనెల 9న సాయంత్రం బైక్‌పై బోధన్ నుంచి బాసర వెళ్తుండగా మార్గమధ్యలో ఫకీరాబాద్ సమీపంలో బైక్ స్కిడ్ అయి తీవ్రంగా గాయపడ్డారన్నారు. అనంతరం గణపతి నిజామాబాద్‌లో చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందారని చెప్పారు. మృతుడి భార్య సువర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.

News February 18, 2026

పోలవరం జిల్లా నోడల్ ఆఫీసర్‌గా విశ్వనాథ్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్) పోలవరం జిల్లా నోడల్ ఆఫీసర్‌గా రంపచోడవరం డ్వామా APD. విశ్వనాథ్ బుధవారం నియమితులయ్యారు. ఈ మేరకు కలెక్టర్ దినేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయి గ్రీవెన్స్‌లో వచ్చిన ప్రతీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని విశ్వనాథ్ అన్నారు. జేసీ స్మరణ్ రాజ్ ఆదేశాల మేరకు అధికారుల సహకారం‌తో గ్రీవెన్స్ నిర్వహిస్తామని తెలిపారు.