News February 27, 2025
HNK: పటిష్ఠ పోలీసు బందోబస్తు నడుమ ప్రారంభమైన MLC ఎన్నికల పోలింగ్

ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి ఈరోజు ఉదయం ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ముల్కనూర్ మండలో కేంద్రంలో జిల్లా పరిషత్ హై స్కూల్‌లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు ముల్కనూరు ఎస్సై సాయిబాబా పర్యవేక్షణలో పోలీసులు పట్టిష్ఠమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు.
Similar News
News February 27, 2025
సిద్దిపేట జిల్లాలో ఓటింగ్ పర్సంటేజ్ ఎంతంటే..?

సిద్దిపేట జిల్లాలో MLC ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం 10 వరకు ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే మెదక్-కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఓటింగ్ 8.2% గా నమోదు కాగా ఉపాధ్యాయ ఓటింగ్ 8.8 శాతంగా నమోదైంది. నల్గొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ ఓటింగ్ 8.5 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
News February 27, 2025
సిరిసిల్ల: పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

సిరిసిల్ల పట్టణంలోని కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గీత నగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలోని పోలింగ్ కేంద్రాలను సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం సందర్శించారు. పోలింగ్ సరళి ఎలా జరుగుతుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ శాతం రిపోర్టు ఎప్పటికప్పుడు అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
News February 27, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలింగ్ శాతం వివరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు పట్టభద్రులు 22,397 మంది (5.2 శాతం), ఉపాధ్యాయులు 950 మంది (11.52 )శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తున్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.