News November 14, 2025

HNK: మెరుగైన సేవలు అందించాలి: DMHO

image

ఆరోగ్య సమస్యలతో ప్రాథమిక కేంద్రాలకు వచ్చే ప్రజలకు ఓపికతో వారి సమస్యలను విని అవసరమైన సేవలు అందించాలని DMHO అప్పయ్య అన్నారు. ఎల్కతుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా అవుట్ పేషెంట్ రిజిస్టర్‌ని పరిశీలించి ఎంతమంది ఏ విధమైన సమస్యలతో వస్తున్నారని వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

Similar News

News November 14, 2025

17న ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపికలు

image

ఉమ్మడి మెదక్ జిల్లా టేబుల్ టెన్నిస్ మహిళలు, పురుషులు, 19 సంవత్సరాల లోపు బాల, బాలికలు క్రీడాకారుల ఎంపిక ఈ నెల 17న మెదక్ గుల్షన్ క్లబ్‌లో నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి డాక్టర్ కె.ప్రభు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఉదయం 10 గంటలకు మెదక్ బస్ డిపో వద్ద గల గుల్షన్ క్లబ్‌లో ఆధార్ కార్డు లేదా జనన ధ్రువీకరణ పత్రంతో హాజరు కావాలని సూచించారు. వివరాలకు 94404 90622 సంప్రదించాలన్నారు.

News November 14, 2025

జిల్లా ప్రజలకు సురక్షిత నీటిని అందించాలి : కలెక్టర్

image

గుంటూరు నగరపాలకసంస్థ పరిధిలో ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించేందుకు ఓవర్ హెడ్ ట్యాంక్‌లు నిర్దేశిత సమయంలో శుభ్రం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారుల ఆదేశించారు. జాతీయ రహదారి పై వరద నీటి డ్రైయిన్ల నిర్మాణం, నగరపాలక సంస్థ పరిధిలో వాటర్ ట్యాంక్ ల క్లీనింగ్ పై అధికారులు, కమిటీ సభ్యులతో కలెక్టర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News November 14, 2025

NGKL: మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్‌కు దరఖాస్తు చేసుకోండి

image

జిల్లాలో మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (NMMS) కోసం ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రభుత్వ జిల్లా పరిషత్, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు ఈ నెల 23న ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మెరిట్ పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. హాల్ టికెట్లు ఈనెల 15 నుంచి జారీ చేస్తామన్నారు.