News February 27, 2025

HNK: పటిష్ఠ పోలీసు బందోబస్తు నడుమ ప్రారంభమైన MLC ఎన్నికల పోలింగ్

image

ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి ఈరోజు ఉదయం ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ముల్కనూర్ మండలో కేంద్రంలో జిల్లా పరిషత్ హై స్కూల్‌లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు ముల్కనూరు ఎస్సై సాయిబాబా పర్యవేక్షణలో పోలీసులు పట్టిష్ఠమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Similar News

News February 27, 2025

పోసానికి వైద్యపరీక్షలు.. విచారిస్తున్న ఎస్పీ

image

AP: పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె PSకు తీసుకొచ్చిన పోలీసులు.. అక్కడే వైద్యుడితో మెడికల్ టెస్టులు చేయించారు. అతడికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని డాక్టర్ గురుమహేశ్ వెల్లడించారు. అనుచిత వ్యాఖ్యల కేసులో పోసానిని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విచారిస్తున్నారు. మరోవైపు వైసీపీ నాయకులు పెద్దఎత్తున అనుచరులతో PSకు రాగా పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో వారు వెనక్కి వెళ్లిపోయారు.

News February 27, 2025

న్యూజిలాండ్ మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరం?

image

CT: మార్చి 2న NZతో మ్యాచులో IND కెప్టెన్ రోహిత్ శర్మకు రెస్ట్ ఇవ్వొచ్చని క్రీడా వర్గాలు తెలిపాయి. అతని స్థానంలో వైస్ కెప్టెన్ గిల్ కెప్టెన్సీ చేస్తారని పేర్కొన్నాయి. PAKతో మ్యాచులో రోహిత్ తొడ కండరాల గాయంతో ఇబ్బందిపడ్డారు. తాజాగా ప్రాక్టీస్ సెషన్‌లోనూ ఆయన యాక్టివ్‌గా పాల్గొనలేదు. దీంతో NZతో మ్యాచుకు హిట్‌మ్యాన్‌కు రెస్ట్ ఇచ్చి రాహుల్‌ను ఓపెనర్‌గా, పంత్‌ను WKగా ఆడిస్తారని వార్తలొస్తున్నాయి.

News February 27, 2025

చిరుత కళేబరానికి పోస్టుమార్టం పూర్తి

image

శ్రీశైలం క్షేత్ర పరిధి రుద్రపార్కు సమీపంలోని అటవీ ప్రాంతంలో బుధవారం మృతి చెందిన చిరుత కళేబరానికి గురువారం వైల్డ్ లైఫ్ డాక్టర్లు అరుణ్ వెస్లీ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. తొలుత అనుమానాస్పద స్థితిలో చిరుత మరణించినట్లు అటవీ అధికారులు భావించినప్పటికీ పోస్టుమార్టం రిపోర్టులో మానవ ప్రమేయం లేనట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఆ తదుపరి పలు నమూనాలను లేబరేటరీకి పంపించినట్లు అటవీ అధికారులు తెలిపారు.

error: Content is protected !!