News May 14, 2024

హోర్డింగ్ కూలిన ఘటన.. వెలుగులోకి కీలక విషయాలు

image

ముంబైలో హోర్డింగ్ <<13244596>>కుప్పకూలిన<<>> ఘటనలో ‘ఇగో మీడియా’ యాడ్ ఏజెన్సీ యజమాని భవేశ్ భిండేపై కేసు నమోదైంది. అతడి గురించి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమంగా హోర్డింగ్‌లు పెట్టినందుకు భవేశ్‌కు 20సార్లకు పైగా అధికారులు ఫైన్ విధించారు. కుప్పకూలిన హోర్డింగ్‌కూ అతను అనుమతి తీసుకోలేదట. ఆ ప్రాంతంలో అనుమతి ఉన్న గరిష్ఠ పరిమాణం కన్నా అది 9 రెట్లు పెద్దదని తేలింది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.

Similar News

News December 10, 2025

ఇంటి చిట్కాలు

image

* ఫర్నిచర్‌కు చెదలు పట్టకుండా ఉండాలంటే కర్పూరం పొడి, లిక్విడ్ పారాఫిన్ సమపాళ్ళలో తీసుకుని కలిపి, ఈ మిశ్రమంతో ఫర్నిచర్ తుడవాలి.
* బొద్దింకలు ఉన్న ప్రదేశాల్లో కీరదోసను ముక్కలుగా కోసి ఉంచితే బొద్దింకలు మళ్లీ కనిపించవు.
* ఓవెన్‌లో వెనీలా ఎసెన్స్ ఉంచి కొద్దిసేపు వేడి చేస్తే లోపలి దుర్వాసనలు తగ్గుతాయి.
* డైనింగ్ టేబుల్ మీద ఈగలు వాలుతుంటే ఉప్పు నీళ్ళలో తడిపిన వస్త్రంతో తుడిస్తే ఈగలు తగ్గుతాయి.

News December 10, 2025

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రంలో కోడిపుంజు ఎందుకు?

image

కార్తికేయుడి వాహనం నెమలి అని అందరికీ తెలుసు. అయితే ఆయన చిత్రాల్లో ఆ పక్షితో పాటు కోడిపుంజు కూడా ఉంటుంది. సుబ్రహ్మణ్యస్వామి శూరపద్ముడిని సంహరించేటప్పుడు ఆ రాక్షసుడు చెట్టు రూపంలో మారాడు. కార్తికేయుడు తన ఆయుధంతో ఆ చెట్టును చీల్చగా ఓ భాగం నెమలి, మరో భాగం కోడిపుంజుగా మారాయి. నెమలిని ఆయన తన వాహనంగా చేసుకున్నాడు. కోడిపుంజుని ధ్వజంగా స్వీకరించాడు. అలా కార్తికేయునికి కోడిపుంజుతో అనుబంధం ఏర్పడింది.

News December 10, 2025

ప్రాణాలు తీసిన గ్యాస్ గీజర్లు

image

గ్యాస్ గీజర్లు కారణంగా 2 వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. బెంగళూరులో 26 ఏళ్ల చాందినీతో పాటు నాలుగేళ్ల కుమార్తె గీజర్ గ్యాస్ లీక్ అయి ప్రాణాలు కోల్పోయారు. UPలోని బఘ్‌పట్‌లో అభిషేక్‌ అనే యువకుడు బాత్‌రూమ్‌లో గీజర్ నుంచి వెలువడిన గ్యాస్ వల్ల మృతిచెందాడు. తలుపును పగులగొట్టి బయటకు తీసేలోపే చనిపోయాడు. క్లోజ్డ్ బాత్‌రూమ్‌లో గ్యాస్ <<18108885>>గీజర్<<>> వినియోగం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.