News March 14, 2025
హోలి: ఈ జాగ్రత్తలు పాటించండి

హోలి అంటేనే రంగుల పండుగ. కలర్స్ ఒకరిపై ఒకరు చల్లుకునే సమయంలో కళ్లలో పడకుండా కళ్లద్దాలు పెట్టుకోవడం ఉత్తమం. కృత్రిమ రంగులు కాకుండా ఆర్గానిక్ రంగులను ఉపయోగించేలా చూడండి. శరీరానికి నూనె అప్లై చేయడం ద్వారా రంగులను త్వరగా శుభ్రం చేసుకోవచ్చు. రంగులు శరీరంపై పడకుండా ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించండి. చెరువులు కాలువలు, జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రమాదానికి గురయ్యే అవకాశముంది. అప్రమత్తంగా ఉండండి.
Similar News
News February 13, 2026
ఆస్ట్రేలియాకు జింబాబ్వే షాక్ ఇస్తుందా?

T20 WCలో జింబాబ్వేపై రికార్డు ఆస్ట్రేలియాను కలవరపెడుతోంది. ఈ రెండు జట్లు 2007లో తలపడిన మ్యాచులో ZIMనే విజయం సాధించడం దీనికి కారణం. 19 ఏళ్ల తర్వాత ఇరు జట్లు ఇవాళ ఉ.11 గంటలకు తలపడనున్నాయి. ఈ టోర్నీలో AUS, జింబాబ్వే చెరో విజయంతో గ్రూప్-Bలో 2, 3 స్థానాల్లో ఉన్నాయి. మరి ఈ మ్యాచులో ఆస్ట్రేలియాకు ZIM మరోసారి షాక్ ఇస్తుందా? లేదా AUS ఆధిపత్యం కొనసాగిస్తుందో చూడాలి.
News February 13, 2026
బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న కౌంటింగ్.. లీడ్‌లో BNP!

బంగ్లాదేశ్‌లో 299 స్థానాల్లో పోలింగ్ ముగిసింది. మొత్తం 55% ఓటింగ్ నమోదైనట్లు సమాచారం. వెంటనే కౌంటింగ్ షురూ చేయగా ఇంకా కొనసాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం తారిఖ్ రెహ్మాన్‌కు చెందిన బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ(BNP) లీడ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన పోటీదారు జమాత్ ఇస్లామీ పార్టీకి ఓటర్ల మద్దతు తగ్గినట్లు సమాచారం. మరోవైపు BNP ఛైర్‌పర్సన్, ప్రధాని అభ్యర్థి రెహ్మాన్ విజయంపై ధీమా వ్యక్తం చేశారు.
News February 13, 2026
ఫిబ్రవరి 13: చరిత్రలో ఈరోజు

1879: స్వాతంత్ర్య సమరయోధురాలు సరోజినీ నాయుడు జననం (ఫొటోలో)
1913: పండితుడు, రచయిత గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి జననం
1930: సినీ గేయ రచయిత దాసం గోపాలకృష్ణ జననం
2014: ఛాయాగ్రాహకుడు, దర్శకుడు బాలు మహేంద్ర మరణం
2015: తెలుగు నవలా రచయిత పి.కేశవ రెడ్డి మరణం
☛ ప్రపంచ రేడియో దినోత్సవం


