News May 3, 2024

పాలస్తీనా మద్దతుదార్లకు హౌతీల అండ

image

అమెరికాలోని యూనివర్సిటీల్లో పాలస్తీనాకు మద్దతుగా నిరసనలు చేపట్టి సస్పెండ్ అయిన విద్యార్థులకు హౌతీ మిలిటెంట్లు మద్దతు తెలిపారు. యెమెన్‌లో హౌతీల ఆధ్వర్యంలో నడిచే సనా యూనివర్సిటీ ఈ మేరకు విద్యార్థులను ఆహ్వానించింది. విద్యార్థుల మానవతా దృక్పథాన్ని అభినందిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు USలో HIMS అనే ఆన్‌లైన్ ఫార్మసీ సంస్థ CEO ఆండ్రూ సైతం ఉద్యోగాలు ఇస్తానని విద్యార్థులకు తన మద్దతు ప్రకటించారు.

Similar News

News December 11, 2025

వనపర్తి: విజయోత్సవ ర్యాలీలు నిషేధం: ఎస్పీ

image

మూడు దశల పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమల్లో ఉంటుందని ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటికీ, ర్యాలీలు, బైక్ శోభాయాత్రలు పూర్తిగా నిషేధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. శాంతియుత వాతావరణం కోసం ప్రతి పౌరుడు సహకరించాలని కోరారు.

News December 11, 2025

అందుకే నరసింహ రైట్స్ అమ్మలేదు: రజినీకాంత్

image

రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ‘నరసింహ’ మూవీని రేపు రీరిలీజ్‌ చేస్తున్నారు. ‘సినీ కెరీర్ స్టార్ట్ అయ్యి 50 ఏళ్లు. నరసింహ రిలీజై 25 ఏళ్లు పూర్తయ్యాయి. థియేటర్లలో ఈ సినిమా చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకోవాలి. అందుకే డిజిటల్ రైట్స్ ఇవ్వలేదు’ అని సినిమా హీరో, ప్రొడ్యూసర్, రచయిత రజినీకాంత్ చెప్పారు. కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్‌లో క్యారెక్టర్ స్ఫూర్తితో నీలాంబరి పాత్ర రాసినట్టు తెలిపారు.

News December 11, 2025

తల్లిలో ఈ లోపం ఉంటే బిడ్డకు గుండె జబ్బులు

image

కొందరు చిన్నారుల్లో పుట్టుకతోనే గుండెజబ్బులు వస్తాయి. తల్లికి ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటీస్ ఉండటం, కొన్ని రకాల మందులు వాడటం వల్ల కూడా ఈ సమస్య రావచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తల్లిలో థయమిన్ డెఫిషియన్సీ ఉంటే బిడ్డకు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. థయమిన్‌ని విటమిన్ బీ1 అని కూడా అంటారు. కాబట్టి ప్రెగ్నెన్సీలో విటమిన్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.