News December 1, 2024
కేజీ చికెన్ ధర ఎంతంటే?

TG: చికెన్ ధరలు కాస్త తగ్గాయి. ప్రస్తుతం HYDలో కేజీ చికెన్ రూ.180 నుంచి రూ.220 వరకు అమ్ముతున్నారు. మరోవైపు కోడిగుడ్డు, కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కోడిగుడ్డు రూ.7, టమాటా రూ.50-70, చిక్కుడు రూ.100, ఉల్లిపాయలు రూ.60 పలుకుతున్నాయి. మరి మీ ప్రాంతంలో చికెన్ రేటు ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News February 18, 2025
చేతుల్లో బ్రెస్ట్ ఫీడింగ్ పంప్, షాంపైన్ గ్లాస్.. హీరోయిన్‌పై విమర్శలు

హీరోయిన్ రాధికా ఆప్టే గతేడాది DECలో బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. 2నెలల అనంతరం తాజాగా ఆమె బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్‌లో మెరిశారు. ఈ సందర్భంగా ఓ చేతిలో బ్రెస్ట్ మిల్క్ పంపింగ్, మరో చేతిలో షాంపైన్ గ్లాస్ పట్టుకొని ఫొటో దిగారు. దీన్ని ఇన్‌స్టాలో షేర్ చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. బిడ్డకు పాలిచ్చే సమయంలో ఆల్కాహాల్ తాగడం సరికాదని, చిన్నారి ఆరోగ్యానికి ప్రమాదమని కామెంట్స్ చేస్తున్నారు.
News February 18, 2025
సిగ్గు సిగ్గు.. సీఎంకు ఇంత అభద్రతా భావమా?: KTR

TG: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన KCR పుట్టినరోజున విద్యార్థులకు స్వీట్లు పంచడం తప్పా అని KTR ప్రశ్నించారు. పుట్టిన రోజు వేడుకలు చేస్తే సరూర్ నగర్ స్కూల్ HMను సస్పెండ్ చేస్తారా అని ఫైరయ్యారు. వార్డు మెంబర్ కాని రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డికి కలెక్టర్ సలాం కొట్టడం, పోలీసులు ఎస్కార్ట్ ఇవ్వొచ్చా అని నిలదీశారు. సిగ్గు సిగ్గు.. CMకు ఇంత అభద్రతా భావమా అని దుయ్యబట్టారు.
News February 18, 2025
మార్చి 28నే ‘హరిహర వీరమల్లు’: నిర్మాత

పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిస్తోన్న ‘హరిహర వీరమల్లు’ మూవీని మార్చి 28నే రిలీజ్ చేస్తామని నిర్మాత ఏఎం రత్నం ప్రకటించారు. ఆ దిశగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. పవన్‌కు సంబంధించిన మిగిలిన షూటింగ్ కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. ఈ చిత్రం నుంచి ఈ నెల 24న రొమాంటిక్ సాంగ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.