News August 11, 2025
HRPS ప్రత్యేక సలహాదారుడిగా కీసర వాసి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా బెలిదే రమేశ్‌గుప్తా నేషనల్ హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ (HRPS) ప్రత్యేక సలహాదారుడిగా నియమితులయ్యారు. రవీంద్రభారతిలో స్వర్ణగిరి టెంపుల్ ఛైర్మన్ మానేపల్లి రామారావు HRPS నేషనల్ స్పెషల్ అడ్వైజర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన రామారావు చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.
Similar News
News March 16, 2026
KMR: ఇంటర్ పరీక్షలకు 95.10 శాతం హాజరు

కామారెడ్డి జిల్లాలో సోమవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ఒకేషనల్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షలకు మొత్తం 1,266 మంది విద్యార్థులకు గాను 1,204 మంది హాజరయ్యారని, 62 మంది గైర్హాజరైనట్లు జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. జిల్లావ్యాప్తంగా 95.10 శాతం హాజరు నమోదైందన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు.
News March 16, 2026
HYD: ఆదివారం.. నెత్తురోడిన నగరం

నగరంలో వీకెండ్ రక్తపాతం జరిగింది. వరుస ప్రమాదాలు, దారుణ ఘటనలు కలకలం రేపాయి. మేడిపల్లిలో కారు ఢీకొనడంతో దంపతులు దుర్మరణం పాలయ్యారు. ఒక్కగానొక్క కొడుకు అనాథయ్యాడు. ఉప్పల్‌లో కానిస్టేబుల్ సుధీర్‌ను దారుణంగా కత్తులతో హత్య చేశారు. శంషాబాద్‌లో వాహనం ఢీకొని విజయ్ (32) మృతి చెందాడు. గచ్చిబౌలిలో కర్ణాటక RTC బస్సు ఢీకొనడంతో బాలమ్మ (68) ప్రాణాలు కోల్పోయింది. ఒకే రోజు ఇన్ని దారుణాలు జరిగాయి.
News March 16, 2026
గ్యాస్ కొరత అంటూ అసత్య ప్రచారం.. వ్యక్తిపై కేసు: సీఐ

గ్యాస్ సిలిండర్ల కొరత అంటూ తప్పుడు సమాచారాన్ని వైరల్ చేసిన యూట్యూబర్ అమీర్ బాషాపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశాలతో క్రైం నంబర్ 40/2026 U/S 353, 196, 356 BNS సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ జయనాయక్ తెలిపారు. ప్రజల్లో గందరగోళం, అశాంతి రేకెత్తించేలా అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.


