News March 28, 2024

2019లో భారీ మెజార్టీ.. ఇప్పుడు ఆత్మహత్య

image

తమిళనాడులోని ఈరోడ్ ఎంపీ గణేశమూర్తి(77) <<12940065>>ఆత్మహత్య<<>> ఆ రాష్ట్రంలో తీవ్ర విషాదాన్ని నింపింది. 2019 ఎన్నికల్లో ఆయన DMK నుంచి పోటీ చేసి 2.10 లక్షల మెజార్టీతో ఘన విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై పురుగు మందు తాగారు. నాలుగు రోజులుగా ప్రాణాలతో పోరాటం చేసి ఇవాళ గుండె పోటుతో తుది శ్వాస విడిచారు. వివాద రహితుడు, సౌమ్యుడిగా ఆయనకు పేరుంది.

Similar News

News February 18, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 18, 2026

మదనపల్లె ఘటన.. నిందితుడిని వదిలిపెట్టబోమన్న సీఎం

image

AP: అన్నమయ్య(D) మదనపల్లెలో <<19164033>>బాలిక హత్య<<>>పై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. చిన్నారి తల్లిదండ్రులతో ఆయనతోపాటు మంత్రులు లోకేశ్, అనిత మాట్లాడారు. నిందితుడిని వదిలిపెట్టబోమని, కఠినశిక్ష పడేలా చూస్తామని చంద్రబాబు చెప్పారు. మరోవైపు బాలికను అత్యాచారం చేసి హత్య చేసినట్లు వైద్యులు నిర్ధారించారు. నిందితుడు కులవర్ధన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

News February 18, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (ఫిబ్రవరి 18, బుధవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.28 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.41 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.42 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.19 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.32 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.