News May 14, 2024

22 నెలల చిన్నారికి ₹17.5 కోట్ల ఇంజెక్షన్‌

image

రాజస్థాన్‌కు చెందిన హృదయాంశ్‌శర్మ(22 నెలలు) కోసం క్రికెటర్ నుంచి కూరగాయలమ్మే వ్యక్తి వరకూ కదిలి వచ్చారు. వెన్నెముక సమస్య ఉన్న చిన్నారి సాధారణ జీవితం గడపాలంటే ₹17.5 కోట్ల జోల్జె‌న్‌స్మా ఇంజెక్షన్‌ అవసరమైంది. చిన్నారి తండ్రి SI కావడంతో పోలీస్ విభాగం క్రౌడ్ ఫండింగ్ ప్రకటించింది. దీపక్ చాహర్, సోనూసూద్‌, NGOలు, సామాన్యులు సైతం విరాళాలిచ్చారు. ఎట్టకేలకు తాజాగా చిన్నారికి ఇంజెక్షన్ అందింది.

Similar News

News December 6, 2025

గుడికెళ్లి, దేవుడిని దర్శిస్తే పుణ్యం లభిస్తుందా?

image

ఆలయాలకు వెళ్లడం అంటే కేవలం దేవుడిని చూడటం కాదు. విగ్రహారాధనలోని రహస్యాన్ని, దర్శనం పరమార్థాన్ని తెలుసుకోవాలి. భగవంతుని గొప్ప లీలలు, గుణాలను మనసులో తలుచుకోవాలి. ఆయనే మనకు శరణం అని గుర్తించాలి. నిరంతరం ఆయనపై ధ్యానం ఉంచుతూ, ఆయనకు నచ్చిన మంచి పనులు చేయాలి. కేవలం దర్శనం కాకుండా, ఈ సత్యాన్ని గ్రహిస్తేనే మనం జీవితంలో మోక్షాన్ని సాధించగలం. <<-se>>#Bakthi<<>>

News December 6, 2025

టైప్ 5 డయాబెటిస్ సింప్టమ్స్ ఏంటో తెలుసా?

image

* న్యూట్రిషన్ డెఫిషియన్సీతో చర్మం, జుట్టు రంగుమారడం.
* లాలాజల గ్రంథుల్లో మార్పులు.
* రోగనిరోధక శక్తి తగ్గడంతో తరచూ చర్మం, చిగుళ్లు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల బారిన పడడం.
* BMI (18.5) కంటే తక్కువ ఉండడం.
* దీర్ఘకాల పోషకాహార లోపం వల్ల ఎదుగుదల ఆగిపోవడం వంటివి టైప్-5 డయాబెటిస్ లక్షణాలు.
* అధిక దాహం, ఒకేసారి బరువు తగ్గడం, నీరసం, కంటిచూపు తగ్గడం డయాబెటిస్ ముఖ్య లక్షణాలు.

News December 6, 2025

డబ్బులు రీఫండ్ చేస్తున్నాం: ఇండిగో

image

భారీగా విమానాల రద్దు నేపథ్యంలో <<18487498>>కేంద్రం<<>> సీరియస్ అవడంతో ప్రయాణికులకు డబ్బులు రీఫండ్ చేస్తున్నామని ఇండిగో ప్రకటనలో తెలిపింది. డిసెంబర్ 5-15 వరకు జరిగిన బుకింగ్స్‌కు సంబంధించి క్యాన్సిల్ లేదా రీషెడ్యూల్ ఆఫర్ చేస్తున్నట్లు పేర్కొంది. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినందుకు క్షమాపణలు చెబుతూ ఎలాంటి ప్రశ్నలు అడగకూడదని పేర్కొంది. మరోవైపు ఫుల్ అమౌంట్ రీఫండ్ అవట్లేదని ప్రయాణికులు కామెంట్లు చేస్తున్నారు.