News April 26, 2024

’స్త్రీ ధనం‘పై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీంకోర్టు

image

భార్యకు చెందిన ’స్త్రీ ధనం‘ (పెళ్లి సమయంలో పుట్టింటి వారు ఇచ్చే ఆస్తి)పై భర్తకు ఎలాంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ కష్టకాలంలో దానిని వాడుకున్నా భార్యకు తిరిగిచ్చేయాలని తేల్చిచెప్పింది. తనకు పుట్టింటివారు ఇచ్చిన ఆభరణాలను తన భర్త, అత్త వాడుకున్నారని ఓ మహిళ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆమెకు బంగారానికి బదులుగా ₹25లక్షలు చెల్లించాలని భర్తను ఆదేశించింది.

Similar News

News April 14, 2026

ఇంటర్ ఫలితాలు.. 13 మంది ఆత్మహత్య

image

తెలంగాణ ఇంటర్ ఫలితాల నేపథ్యంలో విద్యార్థుల బలవన్మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 13 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఏడుగురు అమ్మాయిలు, ఆరుగురు అబ్బాయిలు ఉన్నారు. సంగారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో ఇద్దరు.. సిద్దిపేట, HYD, మేడ్చల్, రంగారెడ్డి, ఆదిలాబాద్, మెదక్, MBNR, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో విద్యార్థి సూసైడ్ చేసుకున్నారు.

News April 14, 2026

మొలక శాతం(వంద విత్తనాలకు) ఎంత ఉండాలి?

image

☛ మొక్కజొన్న (సంకర రకాలు)- 90% ☛ శనగ- 85% ☛ వరి, ఉలవలు, మొక్కజొన్న (సూటి రకాలు)- 80% ☛ జొన్న, కంది, పెసర, మినుము, జీలుగ, అలసంద – 75% ☛ ఆముదం, వేరుశనగ, పొద్దుతిరుగుడు, సోయాచిక్కుడు – 70% ☛ పత్తి, బెండ, కాలిఫ్లవర్ – 65% ☛ మిరప, బీర, పుచ్చ, సొరకాయ, పొట్లకాయ, పాలకూర- 60%. 100 విత్తనాలకు పై విధంగా మొలకశాతం ఉంటే ఆ విత్తనాల ద్వారా మంచి దిగుబడులకు అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

News April 14, 2026

అభి‘షేక్’ చేస్తాడనుకుంటే.. సున్నాల్లో రికార్డ్

image

హిట్టర్ అభిషేక్ శర్మ‌కు ఈ ఏడాది కలిసి రావట్లేదు. షేక్ చేస్తాడనుకుంటే ఇటీవల T20WC, ప్రస్తుతం ఐపీఎల్‌లో వరుసగా విఫలమవుతూ అప్పుడప్పుడూ మెరుస్తున్నారు. ఈ క్రమంలో T20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక <<19642127>>డకౌట్స్<<>>(18 ఇన్నింగ్సుల్లో ఏడుసార్లు) అయిన ఇండియన్ ప్లేయర్‌గా చెత్త రికార్డు నమోదు చేశారు. రోహిత్ 2018లో, సంజూ శాంసన్ 2024లో 32 ఇన్నింగ్సుల్లో ఆరుసార్లు సున్నాకు ఔటయ్యారు.