News August 21, 2025
HYDకు ఆగస్టు, సెప్టెంబర్ ‘FEVER’

జూన్, జులైలో వర్షపాతం అంతగా నమోదు కాకపోవడంతో డెంగ్యూ కేసులు సైతం అడపాదడప నమోదయ్యాయి. కాగా.. ఆగస్టు1 నుంచి వర్షాలు కురుస్తుండటంతో గత 10 రోజుల్లోనే గ్రేటర్‌లో 42 మంది డెంగ్యూ బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. AUG, SEPలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. జనరల్ ఆస్పత్రులకు అత్యధికంగా జ్వరాలతో వస్తున్నవారే ఉంటుండంతో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రజలు పరిశుభ్రంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
Similar News
News January 15, 2026
ఖమ్మం: పంచాయతీల్లో పైరవీల హోరు !

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంచాయతీ కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక రాజకీయ వేడిని పెంచింది. ప్రతి పంచాయతీలో ముగ్గురిని ఎంపిక చేయాల్సి ఉండగా.. గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, దాతలకు ప్రాధాన్యం ఉంటుంది. వీరికి ఓటు హక్కు లేకున్నా వార్డు సభ్యులతో సమానమైన ప్రొటోకాల్ దక్కుతుండటంతో ఆశావహులు పోటీ పడుతున్నారు. తమ అనుచరులకే అవకాశం దక్కేలా సర్పంచ్‌లు, ఎమ్మెల్యేల వద్ద నేతలు మంతనాలు సాగిస్తున్నారు.
News January 15, 2026
‘జైలర్-2’లో విజయ్ సేతుపతి

రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ‘జైలర్ 2’ సినిమాలో నటిస్తున్నట్లు విజయ్ సేతుపతి స్వయంగా వెల్లడించారు. గతంలో ఈ పాత్ర కోసం నందమూరి బాలకృష్ణ పేరు బలంగా వినిపించింది. ఆయన స్థానంలో సేతుపతిని సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మల్టీస్టారర్‌లో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్‌తో పాటు షారుక్ ఖాన్ కూడా అతిథి పాత్రలో కనిపిస్తారని సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి ఇటీవల హింట్ ఇచ్చారు.
News January 15, 2026
సంగారెడ్డి: జర్నలిస్టుల అరెస్ట్ సరికాదు: జగ్గారెడ్డి

జర్నలిస్టులను అర్ధరాత్రి అరెస్టు చేయడం సరికాదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం తెలిపారు. మంత్రులపై ఆధారాలు లేని వార్తలు ప్రసారం చేయడం కూడా సరికాదని పేర్కొన్నారు. వీటిని ప్రసారం చేసిన జర్నలిస్టులకు నోటీసులు ఇవ్వల్సిందన్నారు. సిట్ అధికారులు ఈ విషయంలో సంయమనం పాటించాలని కోరారు.


