News September 11, 2025
HYD:తెలుగు వర్శిటీ.. నేటి నుంచి బస్ సౌకర్యం

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం బాచుపల్లి ప్రాంగణానికి TGSRTC బస్ సౌకర్యం కల్పించారు. రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు Way2Newsతో మాట్లాడారు. నేటి నుంచి బస్ సౌకర్యం ప్రారంభించామని చెప్పారు. ఉదయం 9.45కు నిజాంపేట్ నుంచి విశ్వవిద్యాలయానికి, సాయంత్రం 4.30కు విశ్వవిద్యాలయం నుంచి నిజాంపేటకు నడుపుతున్నట్లు తెలిపారు. వర్శిటీ ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News December 12, 2025
జట్టులో సూర్య, గిల్ అవసరమా?

T20ల్లో పేలవ ఫామ్ కొనసాగిస్తున్నా కెప్టెన్, వైస్ కెప్టెన్ అనే కారణంతో సూర్య, గిల్ కంటిన్యూ అవుతున్నారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. గత 14 T20ల్లో గిల్ 263 పరుగులే చేశారని, అటు తన చివరి 20 మ్యాచుల్లో SKY కేవలం 227 రన్సే కొట్టారని చెబుతున్నారు. వీళ్ల కోసం ఫామ్‌లో ఉన్న శాంసన్, జైస్వాల్ బలవుతున్నారని SMలో పోస్టులు పెడుతున్నారు. వీరిని టీం నుంచి తొలగించాలనే డిమాండ్లు విన్పిస్తున్నాయి. దీనిపై మీ COMMENT.
News December 12, 2025
HYD: ఆ పరీక్షకు రెజోనెన్స్ స్కూల్‌కు అనుమతి లేదు

వనస్థలిపురం, మాదాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మణికొండ ప్రాంతాలలో కొనసాగుతున్న రెజోనెన్స్ పాఠశాలలకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేవని జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు తెలిపారు. ఈ నెల 14న నిర్వహించే ప్రవేశ పరీక్ష మెగా రెసో ఫాస్ట్ (Mega Reso Fast)కు అనుమతులు లేవని, విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు హాజరు కాకూడదని ఆయన తేల్చిచెప్పారు.
News December 12, 2025
ప్రతి ఇంట్లో గంగా జలం ఎందుకు ఉండాలి?

ప్రతి ఇంట్లో గంగా జలం తప్పనిసరిగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. దీనివల్ల సానుకూల శక్తితో గృహంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని అంటున్నారు. ‘గంగాజలం ఎప్పటికీ పాడవదు. ఎన్నేళ్లైనా గంగాజలాన్ని నిరభ్యంతరంగా ఇంట్లో ఉంచుకోవచ్చు. పూజలు, శుభకార్యాల సమయంలో ఉపయోగించవచ్చు. ఇల్లు కడిగేటప్పుడు, ఇంటికి సున్నం వేసే నీటిలో కొద్ది గంగా జలం వినియోగిస్తే.. ఏ ప్రతికూల శక్తి ప్రవేశించదు’ అని అంటున్నారు.


