News March 19, 2025
HYDలో అచ్చంపేట యువకుడి ఆత్మహత్య

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం చేదురుబావి తండాకు చెందిన మూడవత్ బాలు నాయక్ హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు. బతుకుదెరువు కోసం కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ జీవనం సాగిస్తున్నాడన్నారు. ఆర్థిక ఇబ్బందులు, దానికి తోడు కుటుంబ కలహాలతో బాలు నాయక్ ఈరోజు ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News April 18, 2025
MNCL: ఎల్లుండి నుంచే పరీక్షలు.. చదువుకున్నారా..?

జిల్లాలో పది, ఇంటర్ ఓపెన్ స్కూల్ పరీక్షలు ఈ నెల 20 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పదో తరగతి, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు ఇంటర్ పరీక్షలు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లావ్యాప్తంగా 8 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 1,192 మంది విద్యార్థులు పరీక్ష రాస్తారన్నారు. విద్యార్థులు గంట ముందు సెంటర్లకు హాజరు కావాలని సూచించారు.
News April 18, 2025
నిర్మల్: మండలాలకు చేరుతున్న ఎన్నికల సామగ్రి

సర్పంచ్, ఎంపీటీసీ ఎలక్షన్స్ నిర్వహించడానికి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఎలక్షన్లకు సామగ్రిని ఎంపీడీవో ఆఫీస్‌లకు చేరుకున్నాయి. గురువారం కుబీర్ ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న ఎలక్షన్ సామగ్రిని ఎంపీడీవో నవనీత్ కుమార్, ఎంపీఓ మోహన్ సింగ్ పరిశీలించారు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా సిద్ధంగా ఉంటామని, జీపీల్లో వార్డుల వారీగా ఓటర్ లిస్టులు సిద్ధంగా ఉంచామని ఎంపీడీవో తెలిపారు.
News April 18, 2025
నాగర్‌కర్నూల్: పోలీస్ కస్టడీకి గ్యాంగ్ రేప్ నిందితులు

నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలోని ఊర్కొండ పేట ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో ఇటీవల మహిళపై ఏడుగురు యువకులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఘటన తెలిసిందే. వారిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు పంపారు. వారి నుంచి మరిన్ని వివరాలు సేకరించేందుకు గురువారం కస్టడీకి తీసుకున్నట్లు చెప్పారు. ఊర్కొండపేట దేవాలయం సమీపంలో వారు గతంలో అనేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.