News August 21, 2025

HYDలో అదీ ఇదీ ఒకేలా ఉన్నా.. వేర్వేరు..!

image

HYDలోని ఈ ప్రాంతాల పేర్లతో ఎప్పుడూ కన్ఫ్యూజన్‌లో పడుతుంటాం. అవి దిల్‌షుక్‌నగర్-దిల్‌ఖుష్‌నగర్, హయత్‌నగర్-హిమాయత్‌నగర్, తుర్కయంజాల్- దేవరయంజాల్, ప్రతాపసింగారం-బాటసింగారం-నస్దిక్‌సింగారం, కీసర-ఘట్‌కేసర్, గడ్డిఅన్నారం-తట్టిఅన్నారం, అంబర్‌పేట్- పెద్దఅంబర్‌పేట్, లింగంపల్లి-బాగ్‌లింగంపల్లి, హైదర్‌నగర్-హైదర్‌గూడ, IBP పోచారం-ఘట్కేసర్ పోచారంతోపాటు 3 బండ్లగూడలు. ఆకులమైలారం- దండుమైలారం ఇలా ఇంకేమైనా ఉన్నాయా?

Similar News

News January 16, 2026

ఎమోషన్స్‌ను బయటపెట్టాల్సిందే..

image

ప్రతిమనిషికీ భావోద్వేగాలు ఉంటాయి. వివిధ పరిస్థితులను బట్టి అవి బయటకు వస్తాయి. కానీ కొందరు తమకు కోపం, భయం, బాధ వస్తే వాటిని లోలోపలే తొక్కిపెట్టేస్తుంటారు. అవి తలనొప్పి, కడుపు సమస్యలు, గుండెదడ, నిద్రలేమి, అజీర్తి వంటి శారీరక సమస్యల రూపంలో అవి బయటకు వస్తాయంటున్నారు సైకాలజిస్టులు. ప్రతిఒక్కరూ తమలోని ఎమోషన్స్‌ని సన్నిహితులతో పంచుకోవాలని, అలా కుదరకపోతే సైకాలజిస్ట్ సాయం తీసుకోవాలని చెబుతున్నారు.

News January 16, 2026

కనుమ రోజున ఆవులను ఎందుకు పూజించాలి?

image

మన ధర్మశాస్త్రాల ప్రకారం ఆవు శరీరంలో ముక్కోటి దేవతలు ఉంటారు. అందుకే గోపూజ చేస్తే సమస్త దేవతలను పూజించిన ఫలం దక్కుతుంది. ఆవు పృష్ఠ భాగంలో మహాలక్ష్మి నివసిస్తుందని నమ్మకం. అందుకే కనుమ నాడు గోవును పూజిస్తే దారిద్య్రం తొలగి ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెబుతారు. గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే భూప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుందని, గ్రహ దోషాలు తొలగిపోయి కుటుంబంలో సుఖశాంతులు వెల్లి విరుస్తాయని విశ్వాసం.

News January 16, 2026

ఫరీదాబాద్‌లోని ESIC మెడికల్ కాలేజీ& హాస్పిటల్‌లో ఉద్యోగాలు

image

ఫరీదాబాద్‌లోని <>ESIC <<>>మెడికల్ కాలేజీ& హాస్పిటల్‌ 33 ఫ్యాకల్టీ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 21న ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. MBBSతో పాటు సంబంధిత విభాగంలో MD/MS/DNB అర్హత ఉండాలి. ప్రొఫెసర్‌కు నెలకు రూ.2,60,226, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,73,045, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1,48,669 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://esic.gov.in