News April 20, 2024

HYDలో ఆదివారం మటన్‌ షాపులు బంద్

image

ఏప్రిల్ 21న (ఆదివారం) మహవీర్‌ జయంతి వేడుకలు నిర్వహించేందుకు జైనులు సిద్ధమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్‌లో‌ వీరి సంఖ్య ఎక్కువే ఉండడంతో ఆ రోజు భారీ ర్యాలీలు తీయనున్నారు. ఈ నేపథ్యంలోనే GHMC పరిధిలో మాంసం దుకాణాలు (మటన్, పశువుల కబేళాలు, బీఫ్ షాపులు) మూసివేయనున్నారు. ఇందుకు సంబంధించి బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. SHARE IT

Similar News

News December 9, 2025

HYD: సిటీలో నీటిని తోడేస్తున్నారు!

image

మహానగరంలో భూగర్భజలాలను యథేచ్ఛగా వాడేస్తున్నారు. వాడాల్సిన నీటి కంటే ఎక్కువ తోడుతూ భూగర్భాన్ని ఖాళీ చేస్తున్నారు. భూమిలో ఇంకే నీటి కంటే వాడేనీరే అధికంగా ఉంటోంది. సరూర్‌నగర్, శేరిలింగంపల్లి, చార్మినార్, గోల్కొండ, అంబర్‌పేట, ఖైరతాబాద్, అసిఫ్‌నగర్, హిమాయత్‌నగర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో వాడకం మరీ ఎక్కువగా ఉందని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌‌మెంట్ తేల్చింది.

News December 9, 2025

HYD: ఇపుడు 69.. తర్వాత 152.. ఫ్యూచర్‌లో 400 KM!

image

గ్రేటర్ హైదరాబాద్‌లో మున్సిపాలిటీల విలీనం తరువాత విస్తీర్ణం భారీగా పెరిగింది. దీంతో రవాణా అవసరాలు కూడా పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో మహానగరంలో మెట్రో రైలును కూడా మహానగర వ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం 69 కిలోమీటర్ల నెట్ వర్క్ ఉన్న మెట్రో రెండో దశలో మరో 152 KM పెరిగే అవకాశముంది. 2047 నాటికి మెట్రోను 400 KM పెంచి 623 KMకు విస్తరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోంది.

News December 9, 2025

HYD: పడిపోలేదు.. జస్ట్ ఒరిగిందంతే!

image

చూడటానికి యాడ్ బోర్డుపై స్తంభం రెస్ట్ తీసుకుంటున్నట్లు ఉన్న ఈ విజ్యువల్ పెద్దఅంబర్‌పేట్ NH-65పైది. జులైలో భారీ ఈదరుగాలులు, వర్షం ధాటికి ఈ లైన్ ఏబీ స్విఛ్ స్తంభం కిందపడేది. కానీ బోర్డు పక్కనే ఉండటంతో దానిపై వాలింది. 5నెలలు గడుస్తున్నా ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. హైవేపైన ఉన్నదానికే స్పందనలేకపోతే ఇక గల్లీల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.