News May 7, 2025

HYD‌లో ఎన్నిక.. BJP వైపు మళ్లిన ఒక్కరు!

image

HYD స్థానిక సంస్థల MLC కోటాలో ‘ఆ ఒక్క ఓటు’ ఆసక్తిని రేపుతోంది. 22 ఏళ్ల తర్వాత MIM మీద BJP పోటీ చేసింది. BRS పోలింగ్‌లో పాల్గొనలేదు. BJP 24, INC 14, MIM 50 మంది సభ్యులు ఓటేశారు. ఇందులో MIMకు 63 ఓట్లు పోలయ్యాయి. BJPకి 25 ఓట్లు రావడం చర్చనీయాంశమైంది. 24 మంది సభ్యుల సొంత ఓట్లకు అదనంగా మరో ఓటు పడింది. ఇంతకీ ఏ పార్టీ నుంచి మద్దతు వచ్చింది? BJPకి ఓటేసిన ఆ సభ్యుడు ఎవరు? అనేది హాట్‌ టాపిక్‌గా మారింది.

Similar News

News February 12, 2026

పోలవరం జిల్లాలో 29 PHCలకు నిధులు విడుదల

image

పోలవరం జిల్లాలో ఉన్న 29 PHCలకు ఒక్కో ఆసుపత్రికి రూ.2లక్షలు చొప్పున రూ.58 లక్షల నిధులను విడుదల చేసినట్లు జిల్లా వైద్యాధికారిణి డా. సరిత తెలిపారు. ఈనెల 8న నిధులు వచ్చాయన్నారు. 15 లోపు ఆసుపత్రి నిధులు ఖర్చులు ట్రెజరీకి చూపి నిధులు వినియోగించాల్సి ఉందన్నారు. వాటికి మార్గదర్శకాలు ఉన్నట్లు పేర్కొన్నారు.

News February 12, 2026

రష్యాలో వాట్సాప్‌ బ్లాక్!

image

వాట్సాప్‌ను రష్యా పూర్తిగా బ్లాక్ చేయాలని ప్రయత్నిస్తోందని మెటా కంపెనీ ఆరోపించింది. వారి ఇంటర్నెట్ స్పేస్‌లో కంట్రోల్ కోసం సొంత యాప్స్‌ను ప్రమోట్ చేస్తోందని మండిపడింది. వినియోగదారులతో కనెక్ట్ అయ్యేందుకు తాము చేయాల్సిందంతా చేస్తూనే ఉన్నామని తెలిపింది. కాగా తమ ఇంటర్నెట్ సిస్టమ్స్‌లో వాట్సాప్ డొమైన్స్‌ను రష్యా పూర్తిగా బ్లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. MAX యాప్‌ను ఉపయోగించాలని తమ పౌరులను కోరుతోంది.

News February 12, 2026

తాగునీటి సమస్యనా? ఫోన్ చేయండి

image

అనంతపురం జిల్లాలో తాగునీటి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు డీపీఓ నాగరాజ నాయుడు తెలిపారు. నీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురైతే ప్రజలు 9701745437 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. అందిన సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లా ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.