News May 7, 2025

HYDలో కరెంటును కంటిన్యూగా వాడేస్తున్నారు

image

HYDలో విద్యుత్ వినియోగం బాగా పెరిగిపోయింది. ఉక్కపోత కారణంగా ఏసీలు, కూలర్ల వినియోగం అధికంగా ఉండటంతో మీటర్లు నిరంతరాయంగా తిరుగుతున్నాయి. గతేడాది ఏప్రిల్ 24న 3795 మెగా వాట్లను వినియోగించగా ఈ ఏడాది అదే రోజు 4,170 మెగావాట్ల విద్యుత్ వినియోగించారు. ఏప్రిల్ 23 2024లో 3,745 మోగా వాట్లు వినియోగించగా ఈ ఏడాది 4,136 వాడారు. ఈ వారం, పది రోజుల్లో వినియోగం ఇంకా ఎక్కువ ఉండే అవకాశముంది.

Similar News

News February 13, 2026

FLASH: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ BRS కైవసం

image

HYD శివారులోని ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో ఆద్యంతం BRS జోరు కొనసాగింది. 24 వార్డుల్లో 13 BRS అభ్యర్థులు కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 8, BJP 2, స్వతంత్ర అభ్యర్థి ఒక వార్డులో విజయం సాధించారు. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో BRS పీఠం దక్కించుకుంది. దీంతో గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇతర మున్సిపాలిటీల ఫలితాల కోసం Way2News ఫాలో అవ్వండి.

News February 13, 2026

HYD: శివారులో 2చోట్ల బోణీ కొట్టిన BRS

image

రంగారెడ్డి జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల్లో BRS బోణీ కొట్టింది. ఇబ్రహీంపట్నంలోని 24 వార్డులకు సంబంధించిన ఫలితాల్లో 11వ వార్డు BRS అభ్యర్థులు శ్రీలత రాంబాబు 484 ఓట్లతో, 12వ వార్డు కొండిగారి త్రిలోక్ 316 ఓట్లతో విజయం సాధించారు. కౌన్సిలర్ త్రిలోక్ మాజీ MLA కొండిగారి రాములు కుమారుడు. ఫలితాలు వేగంగా తెలుసుకునేందుకు STAY TUNED TO Way2News.

News February 13, 2026

HYDలో ఎయిర్ క్వాలిటీ @194

image

హైదరాబాద్‌లో ఎయిర్ క్వాలిటీలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సాధరణంగా పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంటుంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్‌ క్వాలిటీ శుక్రవారం తెల్లవారుజామున టీచర్స్ కాలనీలో 194గా రికార్డ్ అయ్యింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు.