News August 23, 2025
HYDలో గుంతలు పూడ్చేందుకు స్పెషల్ డ్రైవ్

HYDలో గుంతలు పూడ్చేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లుగా జీహెచ్ఎంసీ అధికారులు తెలియజేశారు. 2025 జూలై 1వ తేదీ నుంచి ఇప్పటికీ 9,899 గుంతలు పూడ్చి వేసినట్లుగా తెలియజేశారు. ప్రతి వార్డులో ఏరియాల ప్రకారంగా ప్రత్యేక బృందాలు రోడ్లను పరిశీలించి మరమ్మతులు చేపడుతున్నట్లుగా అధికారులు వివరించారు.
Similar News
News January 15, 2026
HYDలో పోగులేస్తే మటన్‌కు ఎంత ఖర్చంటే!

సంక్రాంతి పండుగ వేళ ప్రతి ఇంట్లో తునకలు ఉడకాల్సిందే. మటన్ కిలో రూ.1,000 దాటడంతో సామాన్యులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారు. 5- 6 కుటుంబాలు కలిసి ఓ మేకను కొని మాంసాన్ని కుప్పలుగా విభజించుకుంటున్నారు. దీంతో ఒక్కో ఫ్యామిలీకి రూ.1,400 వరకు ఖర్చైనా 2KG వరకు మటన్ వస్తుండటంతో ఈ విధానానికి ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. ఘట్‌కేసర్, మెట్, IBP తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం పోగుల పంపకాలు జోరుగా సాగుతున్నాయి.
News January 15, 2026
HYDలో 3 రోజులు.. సాయంత్రం అలా!

పరేడ్ గ్రౌండ్లో కైట్& స్వీట్ ఫెస్టివల్ నేడు ఆఖరిరోజు. నిరాశ చెందకండి రేపటి నుంచి అసలు మజా ఇక్కడే హాట్ ఎయిర్ బెలూన్ షోతో ఉంటుంది. చల్లని సాయంత్రం, చిన్న ఫైర్‌తో రంగుల బెలూన్‌లు ఆకాశంలో ఎగురుతుంటే ఫ్యామిలీ, దోస్తులతో వాటిని చూస్తూ చిల్ అవ్వడం కంటే ఏంకావాలి. ఆకాశంలో ఎగిరే ఈ బెలూన్లు నగరవాసులతో సహా పొరుగు రాష్ట్రాల వారికి మరపురాని అనుభూతిని అందించనున్నాయి. నేడు కైట్ ఫెస్టివల్‌కు భారీగా తరలిరానున్నారు.
News January 15, 2026
సంక్రాంతి వేళ HYDలో DANGER

HYDలో ఎయిర్ క్వాలిటీ మరోసారి ప్రమాదకర స్థాయికి చేరింది. పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో నగరంలో కాలుష్యం పెరుగుతూనే ఉంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్ క్వాలిటీ గురువారం తెల్లవారుజామున గాజులరామారంలో 239కి చేరింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. 2, 3 రోజులుగా వాయు నాణ్యత తగ్గుతూ.. ఇవాళ ప్రమాదకర స్థాయికి చేరింది.


