News September 12, 2025

HYDలో డ్రోన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్

image

HYDలో డ్రోన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నట్లుగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ (DGQA) ప్రకటించింది. మిలిటరీ డ్రోన్ డెవలప్మెంట్ కోసం ఇదొక వేదిక కానుంది అని పేర్కొన్నారు. అంతేకాక, UAV, డ్రోన్ సామర్థ్యాలను పెంచే దిశగా అడుగులు పడనున్నట్లు తెలిపారు. ఈ కీలక అడుగు డ్రోన్ టెక్నాలజీని మరో స్థాయికి తీసుకెళ్తుందని ఆశాభవం వ్యక్తం చేశారు.

Similar News

News December 16, 2025

సిద్దిపేట: లోక్ అదాలత్‌లో కేసులు రాజి చేసుకోండి: జిల్లా జడ్జి

image

డిసెంబర్ 21న నిర్వహించే లోక్ అదాలత్‌లో అత్యధిక క్రిమినల్ కంపోండెబుల్, సివిల్ కేసులు, రాజి చేసుకునే విధంగా చర్యలు తీసుకోవలని సిద్దిపేట జిల్లా న్యాయమూర్తి సాయి రమాదేవి సూచించారు. మంగళవారం సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ కోర్టు జడ్జిలతో వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అందులో రాజిపడే కేసులను లోక్ అదాలత్‌లో రాజీ చేసుకోవాలన్నారు.

News December 16, 2025

BREAKING: కామారెడ్డి జిల్లాలో విషాదం

image

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన జంగం మహేశ్వరి(30) అనే వివాహిత మంగళవారం తన ఇంట్లో ఉరేసుకుని చనిపోయిందని కుటుంబసభ్యులు, గ్రామస్థులు తెలిపారు. సీఏగా విధులు నిర్వహిస్తున్న మహేశ్వరి మధ్యాహ్నం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందన్నారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎస్ఐ ఆంజనేయులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, వివరాలు సేకరించారు.

News December 16, 2025

వాహనదారులు జాగ్రత్త: ఎస్పీ నరసింహ

image

రాబోయే రెండు, మూడు రోజులు రాష్ట్రంలో కోల్డ్ వేవ్స్, దట్టమైన పొగమంచు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎస్పీ నరసింహ ప్రజలను అప్రమత్తం చేశారు. తెల్లవారుజామున ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, హైవేలపై డ్రైవ్ చేసేవారు తక్కువ వేగంతో, మంచి లైటింగ్, ఇండికేటర్లతో ఒకే లైన్‌లో వెళ్లాలని సూచించారు. రోడ్డు భద్రత పాటించి, సురక్షితంగా గమ్యం చేరుకోవాలని కోరారు.