News November 20, 2025

HYDలో పక్షులు చూద్దామన్నా.. కనిపించట్లేదు!

image

HYD నుంచి ORR పరిసరాల్లో గతంలో అనేక రకాల పక్షులు కనపడేవి. అయితే ఇటీవల వలస పక్షుల సంచారం గణనీయంగా తగ్గిపోయింది. మారుతున్న వాతావరణం, వేగంగా పెరుగుతున్న పట్టణీరీకరణ, జలవనరుల తగ్గుదల, చెరువులు, కుంటలు తగ్గటం వంటి కారణాలు పక్షుల నివాసాలను ప్రభావితం చేస్తున్నాయి. పర్యావరణాన్ని కాపాడకపోతే జీవ వైవిధ్యం మరింత ప్రమాదంలో పడుతుందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

Similar News

News January 19, 2026

పెద్దపల్లి: ‘ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పకడ్బందీగా అమలు చేయాలి’

image

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కట్టుదిట్టంగా అమలు చేయాలని తెలిపారు. అన్ని పరిహార చెల్లింపులు సమయానికి పూర్తవ్వాలని, ప్రభుత్వ ప్రతిపాదనలు సమర్పించాలని చెప్పారు. విద్యార్థులు స్కాలర్‌షిప్‌లకు తప్పనిసరిగా దరఖాస్తు చేయాలని, విద్యాసంస్థలకు మౌలిక సదుపాయాలు పటిష్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు.

News January 19, 2026

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏయూ విద్యార్థులకు పోటీలు

image

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్ర విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో కళాశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నారు. ఈనెల 24న ఉదయం 10 గంటలకు NSS భవనంలో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, ఆర్ట్స్ కళాశాల పరిధిలోని చిత్రలేఖన విభాగంలో చిత్రలేఖనం పోటీలను నిర్వహిస్తారు. విజేతలకు 26వ తేదీన బహుమతులు ప్రదానం చేస్తారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలని అధికారులు సూచించారు.

News January 19, 2026

సిరిసిల్ల: ‘కోర్సును సద్వినియోగం చేసుకోవాలి’

image

ఎస్సీ స్టడీ సర్కిల్ ఫౌండేషన్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలని సిరిసిల్ల ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ ఫౌండేషన్ కోర్సు కరపత్రాలను సోమవారం ఆమె కలెక్టరేట్లో ఆవిష్కరించారు. జిల్లాకు చెందిన అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగ అభ్యర్థులు https://tsstudycircle.co.in వెబ్ సైట్ లో ఈనెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.