News April 2, 2024
HYDలో పెరుగుతున్న ఎండలు

HYD నగరంలో ఎండలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. మల్లాపూర్, కుత్బుల్లాపూర్, మియాపూర్ ప్రాంతాల్లో గత 24 గంటల్లో ఏకంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శేరిలింగంపల్లి, కాప్రా, ఖైరతాబాద్, ఉప్పల్, చందానగర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డైంది. వడగాలులు వీస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News February 12, 2026
ఫ్యూచర్ సిటీ, RRR.. పల్లెల రూపు రేఖలు మారనున్నాయా.?

ఎన్ని అడ్డంకులు ఎదురైనా భారత్ ఫ్యూచర్ సిటీ పేరుతో గొప్ప నగరాన్ని నిర్మించి చూపిస్తామని రేవంత్ సర్కార్ ఢంకా బజాయించి చెబుతోంది. దీంతో పాటు కందుకూరు, యాచారం, తలకొండపల్లి, ఆమనగల్ ప్రాంతాల మీదుగా రీజనల్ రింగ్ రోడ్డు కూడా రానున్న విషయం విదితమే. ఈ ప్రాజెక్టుల గనుక నిర్మాణం చేపడితే ఇక్కడి పల్లెల రూపు రేఖలు నిజంగా మారే అవకాశం ఉందా అని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. మీ కాంమెంట్.
News February 11, 2026
3pm రంగారెడ్డి అప్‌డేట్.. దూసుకొచ్చిన ఆమన్‌గల్

RR మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఊపందుకుంది. 2 తర్వాత ఓటర్లు కేంద్రాలకు కదిలారు. జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో 1, 2 మినహా మిగతా వార్డుల్లో పోలింగ్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. మ.3గం. వరకు జిల్లాలో 68.77% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ఆమనగల్లులో 76.33%, చేవెళ్ల 73.04% ఇబ్రహీంపట్నం 68.6%, మొయినాబాద్ 69.79, శంకర్‌పల్లి 65.19, షాద్‌నగర్‌లో 65.25% నమోదైంది. పోలింగ్‌కు మరో 1:10 గం. సమయం మిగిలి ఉంది.
News February 11, 2026
RR: 57.68%తో చేవెళ్ల టాప్.. మొత్తం ఎంతంటే!

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కాస్త ఊపందుకుంది. 12 తర్వాత ఓటు వేసేందుకు ఓటర్లు కేంద్రాల వద్ద బారులు తీరారు. జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో 1, 2 మినహా మిగతా వార్డుల్లో పోలింగ్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు జిల్లాలో 52.57% పోలింగ్ నమోదైంది. ఆమనగల్లు 54.4%, చేవెళ్ల 57.68,% ఇబ్రహీంపట్నం 52.73%, మొయినాబాద్ 49.67, శంకర్‌పల్లి 49.63, షాద్‌నగర్ 52.43% నమోదైంది.


